ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Google Manager: గూగుల్‌ ఉన్నతోద్యోగి కిడ్నాప్.. బలవంతంగా వివాహం జరిపించి ఆ తర్వాత ఏం చేశారంటే..

ABN, First Publish Date - 2022-10-16T17:44:00+05:30

భోపాల్‌లోని కమలానగర్ ప్రాంతంలో గూగుల్ మేనేజర్‌ను బందీగా ఉంచి మహిళతో బలవంతంగా వివాహం జరిపించిన కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్‌లోని కమలానగర్ ప్రాంతంలో గూగుల్ మేనేజర్‌ను బందీగా ఉంచి మహిళతో బలవంతంగా వివాహం జరిపించిన కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు గణేష్ శంకర్ బెంగళూరులోని గూగుల్‌లో సీనియర్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. అతను IIM షిల్లాంగ్‌లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) చదువుతున్న సమయంలో భోపాల్‌కు చెందిన సుజాత అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కూడా ఇద్దరూ తరచుగా మాట్లాడుకునేవారు. 


ఇది కూడా చదవండి..

ఇంటి నుంచి అదృశ్యమై రైలెక్కిన 16 ఏళ్ల బాలిక.. అనుమానంతో ప్రశ్నించిన టీటీఈ ఆమె చెప్పిన సమాధానం విని..


ఇటీవల సుజాత మాట్లాడుకుందామంటూ గణేష్‌ను భోపాల్‌కు పిలిపించింది. సుజాత కుటుంబ సభ్యులు గణేష్‌కు బలవంతంగా మత్తు మందు ఇచ్చి బందీగా ఉంచారు. అనంతరం గణేష్ చేత బలవంతంగా సుజాత మెడలో తాళి కట్టించారు. ఫొటోలు, వీడియోలు తీశారు. వాటి ఆధారంగా బ్లాక్‌మెయిల్‌కు దిగారు. రూ. 40 లక్షలు ఇవ్వకుంటే తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు. దీంతో గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-10-16T17:44:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising