ఇంటి నుంచి అదృశ్యమై రైలెక్కిన 16 ఏళ్ల బాలిక.. అనుమానంతో ప్రశ్నించిన టీటీఈ ఆమె చెప్పిన సమాధానం విని..

ABN , First Publish Date - 2022-10-16T17:29:41+05:30 IST

ఆ బాలిక వయసు 16 సంవత్సరాలు.. మధ్యప్రదేశ్‌లో పదో తరగతి చదువుతున్న ఆ బాలిక ఇంటి నుంచి పరారై నేపాల్ వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది.

ఇంటి నుంచి అదృశ్యమై రైలెక్కిన 16 ఏళ్ల బాలిక.. అనుమానంతో ప్రశ్నించిన టీటీఈ ఆమె చెప్పిన సమాధానం విని..

ఆ బాలిక వయసు 16 సంవత్సరాలు.. మధ్యప్రదేశ్‌లో పదో తరగతి చదువుతున్న ఆ బాలిక ఇంటి నుంచి పరారై నేపాల్ వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది.. ఆ బాలికను ప్రశ్నించిన టీటీఈ సర్ది చెప్పి రైలు దింపి పోలీసులకు అప్పగించాడు.. పోలీసులు ఆ బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాకు చెందిన 16 ఏళ్ల బాలిక మయూరి (అసలు పేరు కాదు) పదో తరగతి చదువుతోంది. ఇటీవల ఆ బాలిక తల్లిదండ్రుల తీరుతో విసిగిపోయి ఇంటి నుంచి పరారైంది. రైలు టీటీఈ ఆమెను ప్రశ్నించారు. అతడికి ఆ బాలిక తన కథ చెప్పింది. 


ఇది కూడా చదవండి..

బిజినెస్ డీల్ అంటూ హోటల్‌కు పిలిచి కాఫీ ఇచ్చిన భాగస్వామి.. ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏంటంటే..


`నా వయస్సు 16 సంవత్సరాలు. నేను 9వ తరగతి చదివుతున్నాను. ముంబైలోని తథాస్తు బిల్డింగ్‌ పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నాను. నాన్న వెల్డింగ్ పని చేస్తుంటాడు. ప్రతిరోజూ తాగి వచ్చి నన్ను, అమ్మను  కొడుతుంటాడు. ప్రతి చిన్న విషయానికి నన్ను కొడుతుంటాడు. రోజూ ఏదో విషయమై అమ్మతో గొడవ పడి కొడుతుంటాడు. అమ్మ పడే బాధ చూడలేకపోతున్నాను. అలాగని ఏమీ చేయలేకపోతున్నాను. తండ్రి మొహం కూడా చూడకూడదనే ఉద్దేశంతో ఇంటి నుంచి వచ్చేశాను. నా స్నేహితులిద్దరూ దీపావళికి కోసం నేపాల్ వెళ్లారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే కాస్త టెన్షన్ తగ్గుతుందని నేను కూడా అక్కడకు వెళ్తున్నాన`ని ఆ బాలిక చెప్పింది. 


ఆ బాలిక చెప్పింది విన్న టీటీఐ ఆమెకు నచ్చ చెప్పాడు. ఖాండ్వా రైల్వే స్టేషన్‌లో ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బందికి ఆ బాలిక గురించి చెప్పారు. ఆ బాలికను ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని ముంబై పంపించారు. అప్పటికే బాలిక తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. 


Updated Date - 2022-10-16T17:29:41+05:30 IST