ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ బాలిక సంకల్పానికి హ్యాట్సాఫ్.. ఒంటికాలితో గెంతుకుంటూ రోజూ పాఠశాలకు.. టీచర్ అవ్వాలని కోరిక..!

ABN, First Publish Date - 2022-05-24T22:35:29+05:30

ఆ బాలిక వయసు పదేళ్లు.. రెండేళ్ల క్రితం ఓ ప్రమాదంలో ఓ కాలు కోల్పోయింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ బాలిక వయసు పదేళ్లు.. రెండేళ్ల క్రితం ఓ ప్రమాదంలో ఓ కాలు కోల్పోయింది.. చిన్నప్పట్నుంచి టీచర్ కావాలని కలలు కన్న ఆ బాలిక ఆ ప్రమాదంలో కాలు మాత్రమే కోల్పోయింది.. ధైర్యాన్ని కాదు.. అందుకే ఒంటి కాలితోనే కిలో మీటరు దూరం గెంతుకుంటూ పాఠశాలకు వెళుతోంది.. తన సంకల్ప బలంతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.. బీహార్‌లోని జముయ్‌కు చెందిన సీమా అనే బాలిక గురించి తెలుసుకుంటే హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు. 

ఇది కూడా చదవండి..

Viral Video: సరిగ్గా ఆరేళ్ల క్రితం నడిరోడ్డుపై దిక్కుతోచని స్థితిలో Noujisha.. ఇప్పుడు ఆమె రేంజ్ ఏంటంటే..


బీహార్‌లో ఫతేపూర్‌కు సమీపంలోని ఖైరా గ్రామానికి చెందిన సీమా తండ్రి ఓ వలస కూలీ. అతనికి ఉన్న మొత్తం ఆరుగురు సంతానంలో సీమ రెండో బిడ్డ. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సీమ ఓ కాలు కోల్పోయింది. ఇంటి దగ్గరే కూర్చుని రోజు స్కూలుకు వెళుతున్న పిల్లలను చూసి కుమిలిపోయేది. చివరకు తను కూడా పాఠశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. తను రోజూ స్కూలుకు వెళ్లి బాగా చదువుకుంటానని తల్లిని ఒప్పించింది. ఆ బాలిక ఇంటి నుంచి స్కూలు కిలోమీటరు దూరంలో ఉంది. ఆ దూరం అంతా సీమ ఒంటి కాలితో గెంతుకుంటూనే వెళుతుంది. 


`నా కాలు పోయినా నాకు పెద్ద ఇబ్బందేం లేదు. నా పనంతా నేనే చేసుకుంటాను. కాలు లేకపోవడం నా చదువుకు అడ్డంకి కాదు. నేను బాగా చదివి టీచర్ కావాలనుకుంటున్నా. పెద్దయ్యాక నాలాంటి పేద పిల్లలకు చదువు చెబుతాన`ని సీమ పేర్కొంది. సీమ ఆత్మవిశ్వాసం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ పాపకు సాయం చేయాల్సిందిగా నెటిజన్లు కోరుతున్నారు. కొందరు నెటిజన్లు అయితే ఈ పాపకు సంబంధించిన వీడియోను సోనూసూద్‌కు షేర్ చేస్తున్నారు. 





Updated Date - 2022-05-24T22:35:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising