Viral Video: సరిగ్గా ఆరేళ్ల క్రితం నడిరోడ్డుపై దిక్కుతోచని స్థితిలో Noujisha.. ఇప్పుడు ఆమె రేంజ్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-24T18:09:25+05:30 IST

ఆరేళ్ల క్రితం ఆమె నడిరోడ్డుపై దిక్కుతోచని స్థితిలో ఉంది.. భర్త పెట్టే టార్చర్ భరించలేక చనిపోవాలనుకుంది..

Viral Video: సరిగ్గా ఆరేళ్ల క్రితం నడిరోడ్డుపై దిక్కుతోచని స్థితిలో Noujisha.. ఇప్పుడు ఆమె రేంజ్ ఏంటంటే..

ఆరేళ్ల క్రితం ఆమె నడిరోడ్డుపై దిక్కుతోచని స్థితిలో ఉంది.. భర్త పెట్టే టార్చర్ భరించలేక చనిపోవాలనుకుంది.. ఇంటి ఆవరణలో ఉన్న బావిలోకి దూకాలని అక్కడకు వెళ్లింది.. అయితే ఆమెకు ధైర్యం సరిపోలేదు.. వెనక్కి వచ్చేసి తన సమస్యలతో పోరాడడం మొదలుపెట్టింది.. భర్తకు విడాకులు ఇచ్చేసి ఏడాది వయసున్న కొడుకుతో కలిసి బయటకు వెళ్లపోయింది.. కష్టపడి చదివి పోలీస్ అధికారిణిగా మారింది.. తనలాంటి మహిళలు ఎందరికో ఆదర్శంగా నిలిచింది.. కేరళకు చెందిన నౌజిష స్ఫూర్తివంతమైన కథ ఇది. 

ఇది కూడా చదవండి..

కోచింగ్ తీసుకోకుండానే రూ.23 లక్షల ప్యాకేజీతో జాబ్.. చదువు పూర్తవకుండానే ఉద్యోగాన్ని సాధించిన ఈ యువతి కథ ఇదీ..


కేరళలోని కోజికోడ్‌కు చెందిన నౌజిష ఆరేళ్ల క్రితం తన శాడిస్ట్ భర్తను వదిలేసి కొడుకుతో పాటు బయటకు వచ్చేసింది. ఆ సమయంలో నౌజిషకు ఆమె అక్క నౌఫా అండగా నిలబడింది. నౌజిష కొడుకు అల్హామ్ బాధ్యతలు తీసుకుంది. దీంతో నౌజిష పూర్తిగా చదువుకే అంకితమైంది. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన నౌజిష 2021లో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సంపాదించింది. ప్రస్తుతం త్రిసూర్‌లో సివిల్ పోలీస్ ఆఫీసర్‌గా పని చేస్తోంది. పరేడ్ అనంతరం తన ఏడేళ్ల కొడుకుతో కలిసి సరదాగా గడుపుతున్నప్పుడు తీసిన వీడియోను నౌజిష సోమవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


`మహిళలకు వివాహం ముఖ్యం కాదు. ఉద్యోగమే ముఖ్యం. ఆర్థిక స్వాతంత్ర్యమే మహిళకు నిజమైన శక్తిని అందిస్తుంది. బాధలు తట్టుకోలేక మనలో మనమే కుమిలిపోవడం కంటే మన కలల్ని నెరవేర్చుకునేందుకు బయటకు వచ్చి పోరాడడం మంచిది. నా అనుభవం నాకు అదే నేర్పింది. మనం నిశబ్దంగా బాధలను భరించాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుక భయపడకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించగలమనే దృక్పథాన్ని అలవరుచుకోవాల`ని నౌజిష పేర్కొన్నారు.    



Updated Date - 2022-05-24T18:09:25+05:30 IST