ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: 20 నిమిషాల ముందే స్టేషన్ కు చేరిన రైలు.. ప్రయాణికుల రియాక్షన్ చూస్తే..

ABN, First Publish Date - 2022-05-27T22:29:11+05:30

బోరు కొడుతున్న సమయంలో కాలక్షేపం కోసం కొంతమంది పాటలు పాడితే.. మరికొంత మంది ఆటలు ఆడటం కామనే. ప్రస్తుత సమాజంలో యువత కాలక్షేపం కోసం నిత్యం ఫోన్లలోనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోరు కొడుతున్న సమయంలో కాలక్షేపం కోసం కొంతమంది పాటలు పాడితే.. మరికొంత మంది ఆటలు ఆడటం కామనే. ప్రస్తుత సమాజంలో యువత కాలక్షేపం కోసం నిత్యం ఫోన్లలోనే మునిగిపోవడం చూస్తు్న్నాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. మధ్యప్రదేశ్‌లో ఓ రైలు రావాల్సిన సమయం కంటే 20 నిముషాలు ముందే వచ్చింది. రైలు కదలడానికి చాలా సమయం ఉండడంతో ప్రయాణికులకు బోర్ కొట్టింది. ఏం చేయాలో అర్థం కాక, చివరకు అందరినీ ఆశ్చర్యపరుస్తూ వారు చేసిన పని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మధ్యప్రదేశ్‌లోని రత్లాం రైల్వే స్టేషన్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాంద్రా-హరిద్వార్ ఎక్స్‌ప్రెస్ రాత్లాం స్టేషన్‌కు రాత్రి 10:15 గంటలకు చేరుకుంది. సాధారణంగా ఈ రైలు రావాల్సిన సమయం కంటే 20 నిముషాలు ముందే వచ్చింది. రోజూ ఈ రైలు రత్లాం స్టేషన్‌లో 10 నిముషాలు ఆగుతుంది. అయితే ముందుగా చేరుకోవడం వల్ల దాదాపు అరగంట సమయం ఆగాల్సి వచ్చింది. దీంతో బోగీల్లోని గుజరాతీ ప్రయాణికులకు విసుగొచ్చింది.

రసగుల్లల కోసం ఏకంగా ఏడు రైళ్లను ఆపేశారు.. పట్టాలపై టెంట్లు వేసి మరీ క్యూ కట్టిన జనాలు..!


అంతా మాట్లాడుకుని ప్లాట్‌ఫాంపైకి వచ్చి గర్భా నృత్యం చేయడం ప్రారంభించారు. కొంత సేపటికి మరికొందరు వారితో జత కలిశారు. వీరి నృత్యం అక్కడున్న మిగతా ప్రయాణికులను తెగ ఆకట్టుకుంది. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు తెగ నచ్చడంతో.. హ్యాపీ జర్నీ అంటూ విష్ చేస్తూ, తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పెళ్లిలో దండలు మార్చుకుంటుండగా అనుకోని ఘటన.. సిగ్గుతో తల తిప్పుకొన్న వధువు.. ఇంతకీ ఏం జరిగిందంటే..





Updated Date - 2022-05-27T22:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising