పెళ్లిలో దండలు మార్చుకుంటుండగా అనుకోని ఘటన.. సిగ్గుతో తల తిప్పుకొన్న వధువు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-27T03:00:06+05:30 IST

వివాహ సమయాల్లో కొన్నిసార్లు బాధాకరమైన ఘటనలు చోటు చేసుకోవడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. అలాగే కొన్నిసార్లు హాస్యభరిత సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి..

పెళ్లిలో దండలు మార్చుకుంటుండగా అనుకోని ఘటన.. సిగ్గుతో తల తిప్పుకొన్న వధువు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

వివాహ సమయాల్లో కొన్నిసార్లు బాధాకరమైన ఘటనలు చోటు చేసుకోవడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. అలాగే కొన్నిసార్లు హాస్యభరిత సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వధూవరులను ఆట పట్టించడానికి స్నేహితులు ఆకతాయిలు పనులు చేయడం చూస్తుంటాం. అయితే ఒక్కోసారి ఊహించని విధంగా చోటుచేసుకునే ఘటనలు.. తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వివాహ వేడుకలో అతిథులంతా సందడి సందడిగా గడుపుతుంటారు. ఇంతలో వధూవరులు దండలు మార్చుకునే సమయం ఆసన్నమవుతుంది. బంధువుల సమక్షంలో వధూవరులిద్దరూ సంతోషంగా దండలు మార్చుకుంటూ ఉంటారు. ముందుగా వరుడి మెడలో వధువు దండ వేస్తుంది. అనంతరం వరుడు కూడా వధువు మెడలో దండ వేస్తాడు. అదే సమయంలో అతడి ప్యాంట్ కిందకు జారిపోతుంది. అయినా గమనించకుండా అలాగే ఉండిపోతాడు. అయితే పక్కన ఉన్న వాళ్లు చెప్పడంతో చూసుకుని, వెంటనే సరిచేసుకుంటాడు. దీంతో అక్కడే ఉన్న వధువు సిగ్గుతో తల పక్కకు తిప్పుకొంటుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

ఈ యువతి అంటే ఏనుగుకు ఎంత కోపం.. ఏం చేసిందో మీరే చూడండి..





Updated Date - 2022-05-27T03:00:06+05:30 IST