Viral Video: ఈ యువతి అంటే ఏనుగుకు ఎంత కోపం.. ఏం చేసిందో మీరే చూడండి..

ABN , First Publish Date - 2022-05-24T23:51:29+05:30 IST

క్రూర జంతువుల విషయం పక్కన పెడితే.. సాధు జంతువులు కొన్నిసార్లు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అప్పటిదాకా సైలెంట్ ఉన్న జంతువులు ఉన్నట్టుండి బీభత్సం సృష్టిస్తుంటాయి. శాంతంగా ఉండే ఏనుగులు కూడా ఒక్కోసారి...

Viral Video: ఈ యువతి అంటే ఏనుగుకు ఎంత కోపం.. ఏం చేసిందో మీరే చూడండి..

కొన్ని జంతువులు ఒక్కోసారి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అప్పటిదాకా సైలెంట్ ఉన్న జంతువులు ఉన్నట్టుండి బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే సాధారణంగా శాంతంగా ఉండే ఏనుగులు కూడా ఒక్కోసారి పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఏనుగు కూడా ఇలాగే చేసింది. కొందరు యువతులు ఓ ఏనుగును ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆ సమయంలో ఏనుగుకు ఒక్కసారిగా చిర్రెత్తుకొస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


కొందరు యువతులు జంతువులను చూసేందుకు జూకు వెళ్తారు. ఆ సమయంలో ఓ ఏనుగు వద్ద ఆగి ఆసక్తిగా గమనిస్తుంటారు. ఏనుగు తొండాన్ని నిమురుతూ సరదాగా గడుపుతుంటారు. ఏనుగు కూడా మొదట శాంతంగా ఉంటుంది. ఈ సమయంలో కొందరు ఫొటోలు తీసుకుంటుంటారు. అదే సమయంలో ఓ యువతి ఏనుగును ఫొటో తీసేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న ఏనుగుకు ఉన్నట్టుండి కోపం కట్టలు తెంచుకుంటుంది. నన్నే ఫొటో తీసేందుకు ప్రయత్నిస్తావా అనుకుందో ఏమో.. యువతిపై మొఖంపై తొండంతో గట్టిగా ఒక దెబ్బ వేస్తుంది. ఊహించని ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్ అవుతారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

నడి రోడ్డుపై వాహనాలు తిరుగుతుండగా.. యువకుడు చేసిన పనికి అంతా షాక్.. వైరల్ అవుతున్న వీడియో..





Updated Date - 2022-05-24T23:51:29+05:30 IST