ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

French Scientist Joke: కొత్త నక్షత్రం అంటూ ఫొటో షేర్ చేసిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త.. కానీ, అదేంటో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-08-06T20:18:30+05:30

ప్రముఖ ఫ్రెంచ్ శాస్త్రవేత్త (French scientist) ఎటియన్ క్లీన్ సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన జోక్ వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ ఫ్రెంచ్ శాస్త్రవేత్త (French scientist) ఎటియన్ క్లీన్ సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన జోక్ వేశారు. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో వైరల్ అయింది. ఎర్రగా మెరుస్తూ గుండ్రటి ఆకారంలో ఉన్న ఓ పదార్థానికి సంబంధించిన ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో ఉన్నది సూర్యుని నుంచి కేవలం నాలుగు కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రం (distant star) అని, సూర్యుడికి అత్యంత సమీప నక్షత్రమైన ప్రాక్సిమా సెంటారీకి చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (Telescope of Proxima Centauri) తీసిన తాజా ఫొటో అని పేర్కొన్నారు. 


ఇది కూడా చదవండి..

Bangladesh Man: మల్టీప్లెక్స్‌లోకి ఓ పెద్దాయనకు నో ఎంట్రీ.. కారణం ఏంటంటే..


ఎటియన్ పోస్ట్ చేసినది అద్భుతంగా ఉందని చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే ఆ తర్వాత ఆయన అసలు విషయం చెప్పారు. ఆ ఫొటోలో ఉన్నది నక్షత్రం కాదని, స్పానిష్ సాసేజ్ చోరిజో (స్పెయిన్‌లో ప్రాచుర్యం పొందిన వంటకం) ముక్క (Spanish sausage chorizo) అని తెలిపారు. దీంతో ఆ ఫొటోలో ఉన్నది నక్షత్రం అని నమ్మిన చాలా మంది ఎటియన్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో ఎటియన్ క్షమాపణ చెప్పారు. చాలా మంది తన జోక్‌ను అర్థం చేసుకోలేదని, ఇప్పుడు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న సమాచారాన్ని సులభంగా నమ్మకూడదని చెప్పడమే తన ఉద్దేశమని అన్నారు. నకిలీ వార్తలతో పోరాడటం శాస్త్రీయ సమాజానికి అత్యంత ముఖ్యమైన అంశమని అన్నారు. 

Updated Date - 2022-08-06T20:18:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising