Bangladesh Man: మల్టీప్లెక్స్‌లోకి ఓ పెద్దాయనకు నో ఎంట్రీ.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-06T02:22:00+05:30 IST

బంగ్లాదేశ్ (Bangladesh) లోని ఓ మల్టీప్లెక్స్‌లో ఒక పెద్దాయనకు చేదు అనుభవం ఎదురైంది

Bangladesh Man: మల్టీప్లెక్స్‌లోకి ఓ పెద్దాయనకు నో ఎంట్రీ.. కారణం ఏంటంటే..

బంగ్లాదేశ్ (Bangladesh) లోని ఓ మల్టీప్లెక్స్‌లో ఒక పెద్దాయనకు చేదు అనుభవం ఎదురైంది. తనకు ఇష్టమైన హీరో సినిమా చూడాలనుకున్న వ్యక్తిని మల్టీప్లెక్స్‌ సిబ్బంది లోపలికి రానివ్వలేదు. అతడికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. కారణమేంటంటే.. ఆ వ్యక్తి మల్టీప్లెక్స్‌కు లుంగీ (Lungi)లో వెళ్లడమే. ఢాకాలోని ప్రముఖ మల్టీప్లెక్స్ సినీప్లెక్స్ సిబ్బంది లుంగీ ధరించిన వ్యక్తిని లోపలికి రానివ్వలేదు. దీంతో ఆ వ్యక్తి వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌ (Viral News)గా మారింది. 


ఇది కూడా చదవండి..

వరుడి ప్రవర్తన నచ్చక పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి.. అయినా పారిపోయి అతడినే పెళ్లాడిన ఆమె పరిస్థితి చివరకు ఏంటంటే..


ఢాకాకు చెందిన సమన్ అలీ సర్కార్ అనే వ్యక్తి తాజాగా స్టార్ సినీప్లెక్స్‌లో (Star Cineplex) సినిమా చూసేందుకు లుంగీ ధరించి వెళ్లాడు.  ఈ ఘటన బుధవారం జరిగింది. తాను ఢాకాలోని సోనీ స్క్వేర్ బ్రాంచ్‌లోని స్టార్ సినీప్లెక్స్ థియేటర్‌కి `పోరన్` సినిమా చూడటానికి వెళ్లానని, అయితే సిబ్బంది తనకు టికెట్ ఇవ్వలేదని తెలిపాడు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో సినీప్లెక్స్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. తాము ఒక వ్యక్తి వస్త్రధారణ ఆధారంగా వివక్ష చూపించబోమని స్పష్టం చేసింది. 


లుంగీ ధరించారనే కారణంతో తాము ఎవరినీ థియేటర్ నుంచి బయటకు పంపించలేదని పేర్కొంది. ప్రతి ఒక్కరూ తమ అభిమాన చిత్రాలను ఆస్వాదించేందుకు థియేటర్లలోనికి స్వాగతం పలుకుతున్నామని తెలిపింది. అలాగే అలీ సర్కార్‌కు, అతని కుటుంబానికి సినీప్లెక్స్ యాజమాన్యం ఉచితంగా `పోరన్` సినిమా చూపించింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

Updated Date - 2022-08-06T02:22:00+05:30 IST