ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కోల్‌కతాలో ఫుట్‌బాల్ ఫీవర్.. అక్కడి ఫిఫా గల్లీ ఎలా ఉందో చూశారా?

ABN, First Publish Date - 2022-12-03T16:08:32+05:30

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది. ప్రతి మ్యాచ్‌ను ప్రజలు అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు. వీధుల్లోని దుకాణాల ముందుకు చేరి కలిసి ఆటను చూస్తున్నారు. ఏదైనా జట్టు గోల్ చేసినప్పుడల్లా అందరూ కలిసి సంబరాలు చేసుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది. ప్రతి మ్యాచ్‌ను ప్రజలు అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు. వీధుల్లోని దుకాణాల ముందుకు చేరి కలిసి ఆటను చూస్తున్నారు. ఏదైనా జట్టు గోల్ చేసినప్పుడల్లా అందరూ కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ రకమైన జోష్ మన దేశంలో కొంచెం తక్కువ అనే చెప్పాలి. కానీ, కోల్‌కతాలోని ఒక వీధికి వెళితే మీకు ఇవన్నీ ఖచ్చితంగా కనిపిస్తాయి.

దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే కోల్‌కతాలో ఫుట్‌బాల్ అభిమానులు ఎక్కువగా ఉంటారనే సంగతి తెలిసిందే. ఫోటోగ్రాఫర్ సత్తం బందోపాధ్యాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో కోల్‌కతాలో ఉన్న ఓ ఫిఫా గల్లీ ప్రస్తుత ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను అద్భుతంగా ఆస్వాదిస్తోంది. ఆ వీధి మొత్తం ఫుట్‌బాల్ టీమ్‌ల జాతీయ జెండాల పెయింటింగ్‌లతో నిండిపోయింది. ఇళ్ల గోడలపై పెయింటింగ్‌లు, వీధి అంతా డెకరేషన్, ప్రముఖ ఆటగాళ్ల కటౌట్‌లు, వారు ఇష్టపడే జట్ల జెర్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం కోల్‌కతాలోని గిరీష్ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో, రామ్‌జోయ్ సీల్ శిషు పాఠశాలకు ఎదురుగా ఉందని బందోపాధ్యాయ్ తెలిపారు.

Updated Date - 2022-12-03T16:08:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising