ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: గేదెకు నున్నగా గుండు కొట్టించి, గ్రామస్థులందరికీ విందు ఇచ్చిన వ్యక్తి.. కారణమేంటంటే..

ABN, First Publish Date - 2022-09-28T22:12:05+05:30

గతంలో వైద్య సౌకర్యాలు మెరుగ్గా లేని రోజుల్లో ప్రసవం సమయంలోనే పిల్లలు చనిపోతుండేవారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గతంలో వైద్య సౌకర్యాలు మెరుగ్గా లేని రోజుల్లో ప్రసవం సమయంలోనే పిల్లలు చనిపోతుండేవారు. వరుసగా ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన వెంటనే చనిపోతే తర్వాత పుట్టబోయే బిడ్డను బతికించాలని తల్లిదండ్రులు దేవుడికి మొక్కుకునే వారు. ఆ పిల్లాడు బతికితే ఆ తర్వాత మొక్కు తీర్చుకునే వారు. అచ్చం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా అలాగే చేశాడు. అయితే అతడు తన గేదె (buffalo) గురించి మొక్కుకున్నాడు. 


ఇది కూడా చదవండి..

Viral Video: దొంగలకు షాకిచ్చిన వాచ్‌మెన్.. స్కూటీ దొంగిలించి పారిపోతున్న వారిని ఎలా పట్టుకున్నాడంటే..


ఉత్తర‌ప్రదేశ్ (Uttar Pradesh)లోని హర్దోయ్‌కు చెందిన ప్రమోద్ అనే  రైతుకు ఓ గేదె ఉంది. అదంటే ప్రమోద్‌కు ఎంతో ఇష్టం. అయితే దానికి పుట్టిన దూడలు ఎక్కువ రోజులు బతకడం లేదు. రెండు మూడు నెలల్లోనే చనిపోతున్నాయి. దీంతో అతను తనకు ఇష్టమైన గ్రామ దేవతకు మొక్కుకున్నాడు. ఈసారి పుట్టబోయే దూడ బతికితే గేదె వెంట్రుకలు సమర్పిస్తానని, గ్రామస్థులకు విందు భోజనం పెడతానని మొక్కుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఆ తర్వాత గేదెకు జన్మించిన దూడ బతికింది. ఆ దూడ మూడో ఏడాదిలోకి ప్రవేశించిన సందర్భంగా ప్రమోద్ తన మొక్కు తీర్చుకున్నాడు. 


గ్రామదేవత దయ వలనే తన దూడ బతికిందని నమ్మి, గేదెను, దూడను గుడికి తీసుకెళ్లి గుండు గీయించాడు. ఆ తర్వాత దాదాపు 300 మంది గ్రామస్థులకు విందుభోజనం ఏర్పాటు చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారింది.

Updated Date - 2022-09-28T22:12:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising