Viral Video: దొంగలకు షాకిచ్చిన వాచ్‌మెన్.. స్కూటీ దొంగిలించి పారిపోతున్న వారిని ఎలా పట్టుకున్నాడంటే..

ABN , First Publish Date - 2022-09-28T21:57:25+05:30 IST

స్కూటీ దొంగిలించి పారిపోతున్న ఇద్దరు దొంగలకు (Bike Thieves) వాచ్‌మెన్ షాకిచ్చాడు.

Viral Video: దొంగలకు షాకిచ్చిన వాచ్‌మెన్.. స్కూటీ దొంగిలించి పారిపోతున్న వారిని ఎలా పట్టుకున్నాడంటే..

స్కూటీ దొంగిలించి పారిపోతున్న ఇద్దరు దొంగలకు (Bike Thieves) వాచ్‌మెన్ షాకిచ్చాడు. స్కూటీపై వేగంగా పోతున్న వారిని అడ్డుకుని కింద పడేశాడు.. అనంతరం వారిద్దరినీ పోలీసులకు అప్పగించాడు.. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని కల్కాజీ ఎక్స్‌టెన్షన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. వెంటనే స్పందించి సమయస్ఫూర్తితో వ్యవహరించిన వాచ్‌మెన్‌ను పోలీసులు ప్రశంసించారు. 


ఇది కూడా చదవండి..

Water Diet: నీళ్లు, నిమ్మరసంతోనే జీవనం.. 41 ఏళ్లుగా ఆహారానికి దూరంగా ఉంటున్న మహిళ!


మున్సిపల్ అధికారులమని చెప్పి కల్కాజీ ఎక్స్‌టెన్షన్‌లోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. లోపల తాళం వేసి ఉన్న ఇళ్లను పరిశీలించారు. అయితే ఇంతలో వారికి తాళం వేయకుండా ఉన్న బైక్ కన్పించింది. అదృష్టం కలిసి వచ్చిందనుకుని.. వెంటనే బైక్ ఆన్ చేసి స్పీడ్‌గా పొనిచ్చారు. అయితే.. ఆ బైక్ డెలీవరీ బాయ్‌ది. అతను వెంటనే దొంగలు.. దొంగలు.. అని గట్టిగా అరిచాడు. అప్రమత్తమైన వాచ్‌మెన్ (Watch Man) వెంటనే గేట్ వేసేశాడు.


ఆ ఇద్దరు దొంగలు గేటును ఢీకొని కిందపడిపోయారు. వారిలో ఒక వ్యక్తి లేచి పారిపోయాడు. మరో వ్యక్తిని వాచ్‌మెన్ పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు అతని సహాయంతో మరొక వ్యక్తిని కూడా  పట్టుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడ అమర్చిన సీసీటీవీలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయింది.



Updated Date - 2022-09-28T21:57:25+05:30 IST