ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పాముతో చెలగాటం ఆటాడు.. చివరికి చుక్కలు చూపించింది.. ఏం జరిగిందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2022-06-25T03:10:43+05:30

పాములను చూడడమే ఆలస్యం.. వెంటనే కాళ్లకు బుద్ధి చెబుతాం. అయితే కొందరు మాత్రం వాటిని చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలిపెడుతుంటారు. ఈ విషయం పక్కనపెడితే.. పాముతో చెలగాటం ఆడాలని ఎవరికీ ఉండదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాములను చూడడమే ఆలస్యం.. వెంటనే కాళ్లకు బుద్ధి చెబుతాం. అయితే కొందరు మాత్రం వాటిని చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలిపెడుతుంటారు. ఈ విషయం పక్కనపెడితే.. పాముతో చెలగాటం ఆడాలని ఎవరికీ ఉండదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి.. అదే పని చేశాడు. అందరి ముందు హీరో అవుదాం అనుకున్నాడు. చివరికి పాము అతడికి చుక్కలు చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ సభ లాంటి ప్రదేశంలో చాలా మంది జనం కుర్చీల్లో కూర్చుని ఉంటారు. ఆ సమయంలో ఓ పాము అక్కడికి వస్తుంది. ఇంకేముందీ.. దాన్ని చూసి అంతా భయపడిపోతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం.. అందరి ముందు హీరో అవుదామని దాని వద్దకు వెళ్తాడు. తోక పట్టుకుని చెలగాటం ఆడాలని చూశాడు. అయితే రెండో ప్రయత్నం చేయగానే.. పాముకు విపరీతమైన కోపం వచ్చినట్టుంది. వెంటనే బుసలు కొడుతూ అతడి ప్రైవేట్ పార్ట్ వద్ద గట్టిగా పట్టుకుంటుంది. వామ్మో అంటూ.. కేకలు పెడుతూ దాని నుంచి విడిపించుకోవడానికి అతను శతవిధాలా ప్రయత్నిస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. సరైన శిక్షణ లేకుండా పామును పట్టుకోవడానికి వెళ్లిన ఆ వ్యక్తికి బుద్ధి వచ్చేలా.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు.. విష సర్పాలతో జాగ్రత్త తమ్ముడూ.. అంటూ సలహా ఇస్తున్నారు.

తగ్గేదేలే.. అంటున్న యువతి.. గుర్రంతో పోటి పడి మరీ స్కేటింగ్...





Updated Date - 2022-06-25T03:10:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising