Viral Video: తగ్గేదేలే.. అంటున్న యువతి.. గుర్రంతో పోటి పడి మరీ స్కేటింగ్...

ABN , First Publish Date - 2022-06-24T03:01:51+05:30 IST

సోషల్ మీడియాలో విభిన్నంగా ఉండే వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. విచిత్రంగా ప్రవర్తించే జంతువుల వీడియోలు, వినూత్న విన్యాసాలు చేసే మనుషుల వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు...

Viral Video: తగ్గేదేలే.. అంటున్న యువతి.. గుర్రంతో పోటి పడి మరీ స్కేటింగ్...

సోషల్ మీడియాలో విభిన్నంగా ఉండే వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. విచిత్రంగా ప్రవర్తించే జంతువుల వీడియోలు, వినూత్న విన్యాసాలు చేసే మనుషుల వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ యువతి గుర్రం వేగానికి తానేమీ తగ్గనంటూ.. గుర్రంతో సమానంగా స్నేటింగ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. సూర్యోదయం వేళ ఓ మహిళ స్నేటింగ్ చేస్తూ ఉంటుంది. ఇందులో విశేషం ఏమీ లేకున్నా.. గుర్రంతో సమానంగా స్నేటింగ్ చేయడమే ఇక్కడ స్పెషల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో రోడ్డుపై గుర్రంతో పాటూ మహిళ స్నేటింగ్ చేస్తూ వెళ్తుంది. అలాగే ఆమెతో పాటూ ఓ కుక్క కూడా పరుగెత్తడాన్ని వీడియోలో చూడొచ్చు. కొంత దూరం గుర్రంతో పోటీ పడి వెళ్లిన ఆమె.. తర్వాత గుర్రం తల మీద చేయి పెట్టి, ఆప్యాయంగా నిమురుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి మరి.. 

కోతి చేష్టలు అంటే ఇవే.. అద్దం ముందు నిలబడి ఈ కోతి ఏం చేసిందో మీరే చూడండి...





Updated Date - 2022-06-24T03:01:51+05:30 IST