Call Recording: మీ ఫోన్ కాల్‌ను రికార్డు చేస్తున్నారేమోనని అనుమానమా..? ఈ చిన్న టెక్నిక్‌తో ఈజీగా తెలుసుకోండి..!
ABN, First Publish Date - 2022-12-10T14:46:41+05:30
మీరు మొబైల్ ద్వారా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా శబ్దం వస్తోందా? మీ మాటలను అవతలి వ్యక్తి రికార్డు చేస్తున్నారని అనుమానంగా ఉందా? అయితే.. ఈ చిన్న టెక్నిక్ ద్వారా మీ కాల్ రికార్డు (Call Recording) అవుతోందా? లేదా? అనేది సులభంగా తెలుసుకోవచ్చు.
మీరు మొబైల్ ద్వారా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా శబ్దం వస్తోందా? మీ మాటలను అవతలి వ్యక్తి రికార్డు చేస్తున్నారని అనుమానంగా ఉందా? అయితే.. ఈ చిన్న టెక్నిక్ ద్వారా మీ కాల్ రికార్డు (Call Recording) అవుతోందా? లేదా? అనేది సులభంగా తెలుసుకోవచ్చు. నిజానికి కాల్ రికార్డింగ్ అనేది చాలా దేశాల్లో నిషిద్ధం. అందుకే గూగుల్ థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించింది. ఫోన్‌లో ఉండే ఇన్‌బిల్ట్ యాప్‌తో తప్ప థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్‌తో కాల్ రికార్డు చేయడం ప్రస్తుతం కుదరని పని. ఇన్‌బిల్ట్ యాప్‌తో అవతలి వ్యక్తి కాల్ రికార్డ్ చేస్తే ముందుగా మీకు అలెర్ట్ వస్తుంది. మీ కాల్ రికార్డు అవుతోందని అనౌన్స్‌మెంట్ వినిపిస్తుంది. పాత ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఫీచర్ ఫోన్ వాడి మీ కాల్ రికార్డు చేస్తున్నట్టైతే మాత్రం అలాంటి అనౌన్స్‌మెంట్ రాదు. అలాంటి సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు మాట్లాడుతున్న సమయంలో బీప్ శబ్దం (beep sound) లాంటిదేమైనా వస్తోందేమో గమనించాలి. కాల్ మాట్లాడుతున్నప్పుడు బీప్-బీప్ అని శబ్దం వస్తుంటే, మీ కాల్ రికార్డ్ అవుతోందని అర్థం.
కాల్ రికార్డింగ్, కాల్ ట్యాపింగ్‌కు తేడా ఏంటి? (Difference between call recording and call tapping)
చాలా మంది కాల్ రికార్డింగ్, కాల్ ట్యాపింగ్ ఒకటే అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కాల్ రికార్డింగ్ అంటే మీరు మాట్లాడే మాటలను మీతో మాట్లాడుతున్న వ్యక్తి రికార్డు చేస్తాడు. కాల్ ట్యాపింగ్ అంటే ఇద్దరు వ్యక్తుల సంభాషణను మూడో వ్యక్తి రికార్డు చేస్తాడు. కాల్ ట్యాపింగ్‌ను కనుగొనడం మాత్రం చాలా కష్టం. కాల్ ట్యాపింగ్ చేయాలంటే టెలికాం కంపెనీల సహకారం తీసుకోవాలి. చట్ట ప్రకారం కోర్టు అనుమతి కూడా తీసుకోవాలి. మీరు మాట్లాడుతున్న ప్రతిసారి కాల్ డ్రాప్స్ అవుతున్నా, పాత రేడియోలో వచ్చినట్టు సుదీర్ఘంగా బీప్ శబ్దం వస్తున్నా మీ కాల్ ట్యాప్ అవుతున్నట్టు అనుమానించాలి. అయితే చాలా సార్లు అలాంటి సంకేతాలు ఏవీ రాకుండానే కాల్ ట్యాపింగ్ జరుగుతుంటుంది.
Updated Date - 2022-12-10T14:46:43+05:30 IST