ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tamil Nadu News: యువతిపై కన్నేసిన కాలేజ్ క్యాంటిన్ వర్కర్.. ఒంటరిగా వెళ్తుండగా కాపుకాసి మరీ.. చివరకు బాధితురాలి స్నేహితురాలి చొరవతో..

ABN, First Publish Date - 2022-08-03T23:56:04+05:30

ఆ యువతికి తాను చదువుతున్న కళాశాల క్యాంటిన్ వర్కర్ కారణంగా సమస్య తలెత్తుతుందని తెలీదు. తనను ఓ వ్యక్తి టార్గెట్ చేశాడని ఊహించని ఆమె.. రోజూ లాగే కళాశాలకు వచ్చిపోతూ..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువతికి తాను చదువుతున్న కళాశాల క్యాంటిన్ వర్కర్ కారణంగా సమస్య తలెత్తుతుందని తెలీదు. తనను ఓ వ్యక్తి టార్గెట్ చేశాడని ఊహించని ఆమె.. రోజూ లాగే కళాశాలకు వచ్చిపోతూ ఉండేది. క్యాంటిన్‌కు వెళ్తున్న ఆమెను అందులో పని చేసే వ్యక్తి రోజూ గమనించేవాడు. ఎలాగైనా యువతిని పాడుచేయాలని ఆలోచిస్తూ.. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఓ రోజు ఒంటరిగా వెళ్తున్న యువతిని వెంబడించాడు. అతడు చేసిన నిర్వాకాన్ని ఎవరికీ చెప్పలేక అలాగే ఉండిపోయింది. చివరకు బాధితురాలి స్నేహితురాలి చొరవతో ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..


తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం చెన్నై (Chennai) ఓ ఐఐటీ కళాశాల (IIT College) లో ఓ యువతి రెండో సంవత్సరం చదువుతోంది. యథావిధిగా రోజూ కళాశాలకు వచ్చి వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో కళాశాల క్యాంటిన్‌లో పని చేసే వ్యక్తి ఆమెను గమనిస్తూ ఉండేవాడు. ఎలాగైనా ఆమెను పాడు చేయాలని కుట్రపన్నాడు. సమయం కోసం వేచి చూస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో జూలై 24న యువతి సైకిల్‌పై ఒంటరిగా ఇంటికి వెళ్తోంది. ఇది గమనించిన యువకుడు దారి మధ్యలో వేచి చూస్తూ ఉన్నాడు. సడన్‌గా ఆమెపై బలత్కారానికి పాల్పడ్డాడు. దీంతో యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. చివరకు ఎలాగోలా అతడి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లింది. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి.

attack on daughter in law: కోడలు, ఆమె సోదరిని నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చిన మామ.. అంతా చూస్తుండగా.. కారణం ఏంటని విచారిస్తే..


అయితే యువకుడు చేసిన నిర్వాకాన్ని ఎవరికీ చెప్పుకోలేక అలాగే ఉండిపోయింది. చివరకు విషయం తెలుసుకున్న యువతి స్నేహితురాలు.. కళాశాల యాజమాన్యానికి తెలియజేసింది. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సుమారు వంద మంది ఫొటోలను పోల్చి చూసుకున్నారు. చివరకు నిందితుడు కళాశాల క్యాంటిన్‌లో పని చేసే.. బీహార్‌ (Bihar) లోని నవాడా జిల్లాకు చెందిన చందన్ కుమార్‌గా గుర్తించారు. ఎట్టకేలకు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.

police raids: ‘మాస్టర్ మైండ్’ ప్లానింగ్ వేశాడు.. చివరకు యువతులతో సహా అంతా బుక్కయ్యారు... ఇంతకీ ఏం జరిగిందంటే..



Updated Date - 2022-08-03T23:56:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising