ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BigBasket: 2022లో ఎక్కువగా ఆర్డర్ చేసిన కూరగాయ ఏంటో తెలుసా?.. ఆలుగడ్డ కాదు.. ఉల్లిగడ్డ కాదు..

ABN, First Publish Date - 2022-12-29T16:48:27+05:30

డిజిటల్ యుగం (Digital Era) పుణ్యమా అని దేశంలో ఆన్‌లైన్ సేల్స్ (Online sales) వేగం పుంజుకుంటున్నాయి. ఈ నయా ట్రెండ్‌కు కరోనా సంక్షోభం (Corona Crisis) మరింత ఊతమిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: డిజిటల్ యుగం (Digital Era) పుణ్యమా అని దేశంలో ఆన్‌లైన్ సేల్స్ (Online sales) వేగం పుంజుకుంటున్నాయి. ఈ నయా ట్రెండ్‌కు కరోనా సంక్షోభం (Corona Crisis) మరింత ఊతమిచ్చింది. గాడ్జెట్లు, దుస్తులు వంటి వస్తువులే కాకుండా నిత్యావసరాలు, కూరగాయల కోసం కూడా ఆన్‌లైన్ ఆర్డర్లపైనే ఆధారపడుతున్న కస్టమర్లు క్రమంగా పెరుగుతున్నారు. మరి ముగింపుదశకు చేరుకున్న 2022లో ఏయే నిత్యావసరాలకు ఆన్‌లైన్‌లో ఎంత గిరాకీ లభించిందనే ఆసక్తికరమైన విషయాలను ఆన్‌లైన్ గ్రాసరీ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ‘బిగ్‌బాస్కెట్’ (BigBasket) వెల్లడించింది. ఈ మేరకు 2022 వార్షిక రిపోర్ట్‌ను విడుదల చేసింది.

బిగ్‌బాస్కెట్ యాప్‌పై కస్టమర్లు 2022లో పెద్ద సంఖ్యలోనే ఆర్డర్లు ఇచ్చారు. ప్రత్యేకంగా కూరగాయల కోసం చాలా మంది ఆధారపడ్డారు. మరి 2022లో కస్టమర్లు బిగ్‌బాస్కెట్‌పై ఎక్కువగా ఏ వెజిటెబుల్ కోసం ఆర్డర్ చేశారు?.. దేనికి డిమాండ్ ఎక్కువగా ఉంది?.. అంటే కొనుగోళ్లు ఎక్కువగా ఉంటే ఆలుగడ్డ లేదా ఉల్లిగడ్డ అని చాలామంది మదిలో మెదలొచ్చు. కానీ ఈ రెండింటినీ అధిగమించి టమాటా (Tomato) మొదటి స్థానంలో నిలిచింది. 2022లో టమాటా అత్యధికంగా అమ్ముడుపోయిందని బిగ్‌బాస్కెట్ పేర్కొంది. మరోవైపు కొత్తమీర కూడా బిగ్‌బాస్కెట్‌‌పై భారీగా అమ్ముడుపోయింది. 2022లో ఏకంగా 400 కేజీల కొత్తమీరకు ఆర్డర్లు వచ్చాయని తెలిపింది.

ఇక 2022లో మొత్తం 16 కోట్ల ఆర్డర్లు డెలివరీ చేశామని, 55 పట్టణాల పరిధిలో ఈ డెలివరీలు చేశామని వెల్లడించింది. ఏడాది మొత్తంలో 75 కోట్ల ఉత్పత్తులు విక్రయమవ్వగా.. కర్ణాటకలో ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయని వెల్లడించింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య కస్టమర్లు ఆర్డర్లు ఇచ్చారు. బిగ్‌బాస్కెట్ యాప్‌పై డిస్కౌంట్లు, ఆఫర్లు, ప్రోమో కోడ్స్ రూపంలో మొత్ం రూ.1,515 కోట్లు ఆదా చేసుకున్నారని వార్షిక రిపోర్టు పేర్కొంది.

Updated Date - 2022-12-29T16:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising