ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Beer వల్ల కిక్కు మాత్రమే కాదు.. బోలెడన్ని లాభాలు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన Portuguese University పరిశోధకులు

ABN, First Publish Date - 2022-07-06T01:28:54+05:30

బీరు బాబులకు శుభవార్త.. బీరు తాగడం వల్ల కిక్కు మాత్రమే కాదు.. ఆరోగ్య పరంగా మరిన్ని లాభాలు కూడా ఉన్నాయని తేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీరు బాబులకు శుభవార్త.. బీరు తాగడం వల్ల కిక్కు మాత్రమే కాదు.. ఆరోగ్య పరంగా మరిన్ని లాభాలు కూడా ఉన్నాయని తేలింది. బీర్ తాగడం ఆరోగ్యానికి మంచిదని, మోతాదు మించకుండా తీసుకుంటే అనేక లాభాలున్నాయని తాజాగా వెల్లడైంది. పోర్చుగీస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి తీసుకువచ్చారు. ప్రతిరోజూ బీరు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు వెల్లడించడం విశేషం. రాత్రి భోజనంతో పాటు తగు మోతాదులో బీరు కూడా తీసుకుంటే కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ ప్రయోజనం alcoholic, non-alcoholic.. రెండు రకాల బీర్ల వల్ల కలుగుతుందట. 



ఇది కూడా చదవండి..

ఇతడి వయసు 22 ఏళ్లే.. కానీ ఏకంగా రూ.145 కోట్ల సంపాదన.. అసలు ఇంత ఆస్తిని ఎలా సంపాదించాడో తెలిస్తే..


పోర్చుగీసులోని నోవా యూనివర్సిటీ పరిశోధకులు 19 మంది పురుషులపై పరిశోధనలు చేసి ఈ విషయం వెల్లడించారు.  35 సంవత్సరాల వయసులో ఉన్న వీరికి 4 వారాలు రోజూ రాత్రి భోజనంతో పాటు 325 మిల్లీలీటర్ల బీర్ ఇచ్చారు. వీరిలో కొందరికి ఆల్కహాల్ బీర్, మరికొందరికి ఆల్కహాల్ లేని బీర్ ఇచ్చారు. నాలుగు వారాల తర్వాత, ఆ పురుషుల మలం, రక్త నమూనాలను తీసుకున్నారు. ఆ నమూనాలను పరీక్షించి వారి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందినట్టు కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియా చాలా వైవిధ్యమైనదని, ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని కనుగొన్నారు. 


రోజూ బీర్ తాగడం వల్ల బరువు పెరుగుతుందనేది కూడా అపోహేనని, జీవక్రియలకు ఎలాంటి సమస్యా ఉండదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బీర్‌లో ఉండే పాలీఫెనాల్స్ అనే సమ్మేళనాలు పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయని, శరీరంలో వివిధ రకాల బ్యాక్టీరియా ఉండటం చాలా ముఖ్యమని చెప్పారు. 

Updated Date - 2022-07-06T01:28:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising