ఇతడి వయసు 22 ఏళ్లే.. కానీ ఏకంగా రూ.145 కోట్ల సంపాదన.. అసలు ఇంత ఆస్తిని ఎలా సంపాదించాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-07-06T01:04:46+05:30 IST

ప్రతిరోజూ ఎంతో మంది ప్రజలు సోషల్ మీడియాలో తమ విలువైన సమయాన్ని వృథాగా గడిపేస్తుంటారు.

ఇతడి వయసు 22 ఏళ్లే.. కానీ ఏకంగా రూ.145 కోట్ల సంపాదన.. అసలు ఇంత ఆస్తిని ఎలా సంపాదించాడో తెలిస్తే..

ప్రతిరోజూ ఎంతో మంది ప్రజలు సోషల్ మీడియాలో తమ విలువైన సమయాన్ని వృథాగా గడిపేస్తుంటారు. అయితే అదే సోషల్ మీడియాను ఉపయోగించుకుని కొందరు కోట్లలో సంపాదిస్తున్నారు. అవును.. ఇది నిజం. 22 ఏళ్ల వయసున్న ఓ కుర్రాడు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ వందల కోట్లు వెనకేసుకున్నాడు. ఆ కుర్రాడి పేరు ఖాబీ లామ్. ఇటలీకి చెందిన ఖాబీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 


ఇది కూడా చదవండి..

Transparent Fish: అలస్కాలో అరుదైన చేప.. దాని ప్రత్యేకత ఏంటంటే..


టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా కొన్ని లక్షల మంది ఖాబీని ఫాలో అవుతుంటారు. ఒక్క టిక్‌టాక్‌లోనే ఖాబీని 14 కోట్ల మంది అనుసరిస్తుంటారు. ఇక, ఇన్‌స్టాగ్రామ్‌లో 8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. టిక్‌టాక్‌లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన మొదటి వ్యక్తి ఖాబీ. ఖాబీ లామ్ చేసే వీడియోలు చాలా ఫేమస్. తన టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ఏదైనా ప్రమోషనల్ వీడియోను పోస్ట్ చేయాలంటే ఖాబీ రూ.50 లక్షలు వసూలు చేస్తాడు. ప్రస్తుతం ఖాబీ నికర ఆస్తుల విలువ రూ.145 కోట్లు. ఖాబీ ప్రస్తుతం ఓ ఆన్‌లైన్ స్టోర్ కూడా నడుపుతున్నాడు. 


టిక్ టాక్‌లో అత్యధిక లైక్‌లు పొందిన తొలి 25 వీడియోల్లో ఆరు ఖాబీవే కావడం విశేషం. డైలాగులు లేకుండా కామెడీగా, అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్‌లతో ఖాబీ వీడియోలు ఉంటాయి. పెద్దగా చదువుకోలేకపోయిన ఖాబీ ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. కోవిడ్ సమయంలో ఆ ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు. ఆ తర్వాతే టిక్‌టాక్ వీడియోలు చేయడం ప్రారంభించాడు. అనతి కాలంలోనే సూపర్ పాపులర్ అయిపోయాడు. ఏకంగా వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యే స్థాయికి ఎదిగాడు. పలు అంతర్జాతీయ సంస్థలు ఖాబీని తమ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నాయి. 

Updated Date - 2022-07-06T01:04:46+05:30 IST