ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Expensive Trash Bag: చెత్త వేసే ఆ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఎందుకంత ఖరీదంటే..

ABN, First Publish Date - 2022-08-06T21:34:49+05:30

స్పెయిన్‌కు చెందిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్.. Balenciaga. ఈ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పెయిన్‌కు చెందిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్.. Balenciaga. ఈ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. అత్యంత ఖరీదైన ఈ బ్రాండ్ ఉత్పత్తులను ఎంతో మంది ప్రముఖులు వినియోగిస్తుంటారు. తాజాగా ఈ బ్రాండ్ ఓ చెత్త బ్యాగ్ (Expensive Trash Bag)ను రూపొందించింది. ఆ బ్యాగ్ ఖరీదు అక్షరాలా 1800 డాలర్లు (సుమారు రూ.1.42 లక్షలు). ఈ బ్యాగ్ నలుపు, తెలుపు, ఎరుపు, నీలం రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 


ఇది కూడా చదవండి..

Photo: భర్త చిన్ననాటి ఫొటో అల్బమ్ తిరగేస్తూ ఒక ఫొటో చూసి షాక్ అయిన భార్య.. కారణమేంటంటే..


ఈ ట్రాష్ బ్యాగ్‌ను దూడ చర్మంతో తయారు చేశారట. ఈ బ్యాగ్‌ను ఈ ఏడాది మార్చిలో పారిస్‌లోని రెడీ-టు-వేర్ కలెక్షన్‌లో ప్రదర్శించారు. ప్రస్తుతం ఆ బ్రాండ్‌కు సంబంధించిన స్టోర్‌లలో ఆ బ్యాగ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. `ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెత్త బ్యాగ్‌ని తయారు చేసే అవకాశాన్ని నేను కోల్పోలేను. ఎందుకంటే ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని ఎవరు ఇష్టపడరు?` అని Balenciaga's క్రియేటివ్ డైరెక్టర్ Demna Gvasalia పేర్కొన్నారు. కాగా, చెత్త బ్యాగ్ ఖరీదుపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అత్యంత ఖరీదైన డిజైనర్ ట్రాష్ బ్యాగ్‌ను వాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2022-08-06T21:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising