Photo: భర్త చిన్ననాటి ఫొటో అల్బమ్ తిరగేస్తూ ఒక ఫొటో చూసి షాక్ అయిన భార్య.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-08-06T21:01:46+05:30 IST

ఆ మహిళ పేర ఐలిజ్ మెలీనా (26).. ఈక్వెడార్‌కు ( Ecuador) చెందిన ఈ మహిళ కొన్ని రోజుల క్రితం అత్తగారింటికి వెళ్లింది

Photo: భర్త చిన్ననాటి ఫొటో అల్బమ్ తిరగేస్తూ ఒక ఫొటో చూసి షాక్ అయిన భార్య.. కారణమేంటంటే..

ఆ మహిళ పేర ఐలిజ్ మెలీనా (26).. ఈక్వెడార్‌కు ( Ecuador) చెందిన ఈ మహిళ కొన్ని రోజుల క్రితం అత్తగారింటికి వెళ్లింది.. అక్కడ తన భర్త చిన్న నాటి ఫొటో అల్బమ్ (Husband Photo) తెరిచింది.. అందులోని ఓ ఫొటో చూసి ఆమె షాకైపోయింది.. ఎందుకంటే భర్త చిన్నప్పుడు తీసుకున్న ఓ ఫొటోలో ఆమె కూడా ఉంది.. అప్పటికి తన భర్తను ఆమె ఒకసారి కూడా కలవలేదు.. రోడ్డుపై నడుస్తున్నప్పుడు తీసుకున్న ఫొటోలో అనుకోకుండా ఆమె కూడా ఉంది.. ఆ ఫొటో చూసి ఆమె ఆశ్చర్యపోయింది. 


ఇది కూడా చదవండి..

Life Changing Decision: నెలకు 50 వేల జీతాన్నిచ్చే ప్రభుత్వోద్యోగానికి గుడ్ బై చెప్పి వినూత్న ప్రయోగం.. ఇప్పుడు ఏడాదికి రూ.30 లక్షలు..!


`ఆ ఫొటో చూసి నేను, నా భార్త చాలా థ్రిల్ ఫీలయ్యాం. మేం నమ్మలేకపోయాం. చాలా సంతోషంగా, ఆశ్చర్యకరంగా అనిపించింది. ఒక పరేడ్ జరుగుతున్న సమయంలో నా భర్త తీసుకున్న ఫొటో అది. ఆ సమయంలో అక్కడ నేను కూడా ఉండడం యాదృశ్చికం. ఆ ఫొటో గురించి, పరేడ్ గురించి నాకేం తెలీదు. అతనెవరో కూడా అప్పటికి నాకు తెలియద`ని మెలీనా చెప్పింది. ఆ తర్వాత తామిద్దరం ఒకే యూనివర్సిటీలో చదివి, ప్రేమించి పెళ్లి చేసుకున్నామని తెలిపింది. ఏదేమైనా ఈ ఫొటో ఎంతో మధురానుభూతిని కలిగించిందని పేర్కొంది.   

Updated Date - 2022-08-06T21:01:46+05:30 IST