ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: టవల్‌ను మింగేసిన కొండ చిలువ.. దానిని డాక్టర్లు ఎలా కాపాడారంటే..?

ABN, First Publish Date - 2022-07-30T02:17:01+05:30

కొండ చిలువ (python)లకు ఆకలి వేసినపుడు ఏది కనిపిస్తే దానిని మింగేస్తాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండ చిలువ (python)లకు ఆకలి వేసినపుడు ఏది కనిపిస్తే దానిని మింగేస్తాయి.. కొన్నిసార్లు ప్లాస్టిక్ లేదా ఇనుప వస్తువులను కూడా మింగేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటాయి. ఆకలితో అలమటించిన ఓ కొండచిలువ తాజాగా ఓ టవల్‌ (python swallowed towel) ను మింగేసింది. ఆ టవల్‌ను జీర్ణం చేసుకోలేక ఆపసోపాలు పడింది. దాని అవస్థను గమనించిన కొందరు స్థానికులు డాక్టర్లను పిలిచారు. ఆస్ట్రేలియా (Australia)లో ఈ ఘటన వెలుగు చూసింది. 


ఇది కూడా చదవండి..

Killed for Chapati: చపాతీ ఇవ్వలేదని దారుణం.. నడిరోడ్డు మీద హత్య చేసిన వ్యక్తి!


న్యూ సౌత్ వేల్స్‌లోని ఓ కొండ చిలువ ఆకలికి తాళలేక టవల్‌ను మింగేసింది. ఆ తర్వాత దానిని జీర్ణం చేసుకోలేక, బయటకు కక్కలేక నానా అవస్థలు పడింది. దాని పరిస్థితి గమనించిన స్థానికులు వెటర్నరీ డాక్టర్లకు సమాచారం అందించారు. వారు దానిని జంతువుల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే దాని పరిస్థితి విషమంగా మారింది. దాంతో వైద్యులు ఆ కొండ చిలువకు మత్తు మందు ఇచ్చారు. అనంతరం దాని కడుపులోకి ఓ టూల్‌ పైప్‌ను పంపి.. అతి కష్టం మీద ఆ టవల్‌‌ను బయటకు తీశారు. దీంతో ఆ కొండ చిలువ ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   



Updated Date - 2022-07-30T02:17:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising