ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుట్టగానే బిడ్డ ఏడ్వలేదు.. మరి ఏం చేశారు..?

ABN, First Publish Date - 2022-05-28T23:38:00+05:30

సాధారణంగా పిల్లలు పుట్టగానే ఏడుస్తారు. అలా ఏడిస్తేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఓ పసికందు పుట్టడమే నవ్వుతూ పుట్టింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా పిల్లలు పుట్టగానే ఏడుస్తారు. అలా ఏడిస్తేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఓ పసికందు పుట్టడమే నవ్వుతూ పుట్టింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్టియానా వెర్చెర్, బ్లేజియా ముచా దంపతులకు ఎయిలా అనే చిన్నారి జన్మించింది. అయితే పుట్టినప్పుడు ఆ బిడ్డ ఏడ్వలేదు. పెదాల దగ్గర అసాధారణ స్థితి నెలకొనడంతోనే  చిన్నారి ఏడ్వలేక పోయిందని వైద్యులు తెలిపారు. అనంతరం చిన్నారిని పరిశీలించిన వైద్యులు.. అది బైలెటరల్‌ మాక్రోస్టోమియాగా నిర్ధారించారు. ఈ వ్యాధితో  పెదాలు సాగిపోయినట్లు ఉంటుందని వెల్లడించారు. అందుకే ఆ చిన్నారి పుట్టినప్పుడు ఏడ్వ లేకుండా ఉంది.


తల్లి గర్భంలోనే బిడ్డకు ఏడో వారంలో పిండ దశ నుంచే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు వెల్లడించారు. ప్రపంచంలో ఇలాంటి కేసులు ఇప్పటిదాకా 14 మాత్రమే ఉన్నాయని చెప్పారు. సర్జరీతో బిడ్డ స్థితి మెరుగుపడే అవకాశం ఉన్నా.. పెద్దయ్యాక మళ్లీ ఆ స్థితి ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. అయితే చిన్నారి తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డ స్థితిని, ఇలాంటి పరిస్థితులను తాము ఎలా ఎదుర్కొంటున్నామో తెలియజేసేందుకు సోషల్‌మీడియాలో వివరిస్తున్నారు. మరోవైపు బిడ్డ స్థితి తెలిసి కూడా కొందరు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

20 నిమిషాల ముందే స్టేషన్ కు చేరిన రైలు.. ప్రయాణికుల రియాక్షన్ చూస్తే..







Updated Date - 2022-05-28T23:38:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising