బోరు కొడుతున్న సమయంలో కాలక్షేపం కోసం కొంతమంది పాటలు పాడితే.. మరికొంత మంది ఆటలు ఆడటం కామనే. ప్రస్తుత సమాజంలో యువత కాలక్షేపం కోసం నిత్యం ఫోన్లలోనే మునిగిపోవడం చూస్తు్న్నాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. మధ్యప్రదేశ్‌లో ఓ రైలు రావాల్సిన సమయం కంటే 20 నిముషాలు ముందే వచ్చింది. రైలు కదలడానికి చాలా సమయం ఉండడంతో ప్రయాణికులకు బోర్ కొట్టింది. ఏం చేయాలో అర్థం కాక, చివరకు అందరినీ ఆశ్చర్యపరుస్తూ వారు చేసిన పని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్‌లోని రత్లాం రైల్వే స్టేషన్లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాంద్రా-హరిద్వార్ ఎక్స్‌ప్రెస్ రాత్లాం స్టేషన్‌కు రాత్రి 10:15 గంటలకు చేరుకుంది. సాధారణంగా ఈ రైలు రావాల్సిన సమయం కంటే 20 నిముషాలు ముందే వచ్చింది. రోజూ ఈ రైలు రత్లాం స్టేషన్లో 10 నిముషాలు ఆగుతుంది. అయితే ముందుగా చేరుకోవడం వల్ల దాదాపు అరగంట సమయం ఆగాల్సి వచ్చింది. దీంతో బోగీల్లోని గుజరాతీ ప్రయాణికులకు విసుగొచ్చింది.
అంతా మాట్లాడుకుని ప్లాట్‌ఫాంపైకి వచ్చి గర్భా నృత్యం చేయడం ప్రారంభించారు. కొంత సేపటికి మరికొందరు వారితో జత కలిశారు. వీరి నృత్యం అక్కడున్న మిగతా ప్రయాణికులను తెగ ఆకట్టుకుంది. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు తెగ నచ్చడంతో.. హ్యాపీ జర్నీ అంటూ విష్ చేస్తూ, తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఇవి కూడా చదవండి