ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఒంటి కాలితోనే వండర్ చేసి `ఔరా` అనిపించిన చిన్నారి!

ABN, First Publish Date - 2022-11-11T18:49:34+05:30

ఆ చిన్నారి ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం చిన్నబోయింది. అంతులేని పట్టుదలకు విజయం సలాం కొట్టింది. ఒంటి కాలితోనే సాధన చేసిన చిన్నారి స్కేటింగ్‌లో నేషనల్ ఛాంపియన్‌గా నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ చిన్నారి ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం చిన్నబోయింది. అంతులేని పట్టుదలకు విజయం సలాం కొట్టింది. ఒంటి కాలితోనే సాధన చేసిన చిన్నారి స్కేటింగ్‌లో నేషనల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. అన్ని అవయవాలూ ఉండి కూడా కొందరు నిరాసక్తంగా జీవితాన్ని గడిపేస్తారు. చిన్న చిన్న పరాజయాలనే తట్టుకోలేక కుంగిపోతారు. అలాంటిది ఆ బాలికకు ఒక కాలు లేదు. రెండు కాళ్లూ ఉన్నా స్కేటింగ్ చేయడం అనేది సాధారణ విషయం కాదు. అలాంటిది ఆ బాలిక ఒంటి కాలితో స్కేటింగ్ చేసి ప్రేక్షకుల నీరాజనాలందుకుంది.

అర్జెంటీనాకు చెందిన చిన్నారి మిలీ ట్రెజో అడాప్టివ్ స్కేటింగ్ నేష‌న‌ల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని విజేత‌గా నిలిచింది. ఒక్క కాలుతోనే చాక‌చక్యంగా స్కేటింగ్ చేస్తూ, త‌న శ‌రీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవ‌డం చూసి ప్రేక్షకులంతా చ‌ప్పట్లు కొట్టారు. స్కేటింగ్ పూర్తి కాగానే ఆ చిన్నారి వెళ్లి తన తల్లిని కౌగిలించుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారంతా ఆ చిన్నారిని వండర్ గర్ల్గా అభివర్ణిస్తున్నారు.

Updated Date - 2022-11-11T18:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising