ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: చోరీకి వెళ్లిన దొంగకు షాకింగ్ అనుభవం.. సడన్‌గా పోలీసుల ఎంట్రీతో కొత్త ప్లాన్.. మూడో అంతస్తు నుంచి వేళాడుతూ..

ABN, First Publish Date - 2022-06-02T18:40:35+05:30

దొంగతనం చేయాలనే ఉద్దేశంతో బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొంగతనం చేయాలనే ఉద్దేశంతో బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు.. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న మహిళ లేవడంతో డాబా పైకి ఎక్కేశాడు.. మహిళ ఫిర్యాదుతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.. తన దగ్గరకు వస్తే మూడో అంతస్థు నుంచి దూకేస్తానని పోలీసులను ఆ దొంగ బెదిరించాడు.. అతడిని పట్టుకునేందుకు పోలీసులు, కుటుంబ సభ్యులు డాబాపైకి రాగానే అతను దూకేశాడు.. అయితే కింద ఉన్న వ్యక్తులు ఓ దుప్పటి అడ్డు పెట్టి అతడిని కాపాడారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఇది కూడా చదవండి..

రేటు పెంచితే సేల్స్ తగ్గుతాయేమోనని కంపెనీల కొత్త రూటు.. ధర ఒక్క రూపాయి కూడా పెంచలేదు కానీ..


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మల్హర్‌గంజ్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఓ వ్యక్తి దొంగతనం చేయడానికి ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ అలికిడికి ఆ ఇంట్లో నిద్రిస్తున్న మహిళ నిద్ర లేచింది. దీంతో ఆ యువకుడు పైకప్పు ఎక్కాడు. ఇంతలో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. పోలీసులను చూసిన దొంగ మూడో అంతస్థు నుంచి దూకేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. 


అతడిని పట్టుకునేందుకు పోలీసులు, కుటుంబ సభ్యులు డాబాపైకి రాగానే పైనుంచి దూకేశాడు. కింద నిల్చున్న వ్యక్తులు, పోలీసులు దుప్పటి అడ్డు పెట్టి అతడిని కాపాడారు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 



Updated Date - 2022-06-02T18:40:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising