రేటు పెంచితే సేల్స్ తగ్గుతాయేమోనని కంపెనీల కొత్త రూటు.. ధర ఒక్క రూపాయి కూడా పెంచలేదు కానీ..

ABN , First Publish Date - 2022-06-02T18:01:48+05:30 IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ ద్రవ్యోల్బణం తీవ్రంగా భయపెడుతోంది.

రేటు పెంచితే సేల్స్ తగ్గుతాయేమోనని కంపెనీల కొత్త రూటు.. ధర ఒక్క రూపాయి కూడా పెంచలేదు కానీ..

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ ద్రవ్యోల్బణం తీవ్రంగా భయపెడుతోంది. కరోనా లాక్‌డౌన్‌లు, రష్య-ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మొదలైనవి ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా మార్కెట్లో చాలా వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. సాధారణంగా ఏ ఉత్పత్తి రేటు అయినా పెరిగితే సేల్స్ కొంతవరకు తగ్గుతాయి. అందుకే ఎఫ్‌ఎమ్‌సీజీ (ఫాస్ట్ మూవీంగ్ కన్జ్యూమర్ గూడ్స్) రంగానికి చెందిన సంస్థలు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి. తమ ఉత్పత్తి రేటు పెంచకుండా సైజు తగ్గించే పని ప్రారంభించాయి. 


ఇది కూడా చదవండి..

బస్సులో పక్కన కూర్చున్న వాళ్ళు ఇచ్చే వాటిని తింటున్నారా..? ఈ 52 ఏళ్ల మహిళకు ఏం జరిగిందంటే..


ఉదాహరణకు.. ఇంతకుముందు 55 గ్రాముల హల్దీరామ్స్ ఆలూ చిప్స్ ప్యాకెట్ ధర రూ.10 ఉండేది. ఇప్పుడు కూడా రేటు అంతే ఉంది. కానీ, దాని బరువు మాత్రం 55 గ్రాముల నుంచి 44 గ్రాములకు తగ్గిపోయింది. అలాగే, ప్రస్తుతం 135 గ్రాముల విమ్ సబ్బు ధర 10 రూపాయలు. మూడు నెలల క్రితం రూ.10కి 155 గ్రాముల విమ్ సబ్బు వచ్చేది. భారత్‌లోనే కాదు అమెరికా, ఇంగ్లండ్‌లలో కూడా యూనీలివర్, సబ్ వే రెస్టారెంట్లు, మెక్ డోనాల్డ్స్ వంటి సంస్థలు ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయి. 


వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల చిప్స్, మిక్చర్, కుకీస్ తయారు చేసే సంస్థలపై భారం ఎక్కువగా పడుతోంది. ఇటీవల నెస్ట్లీ సంస్థ క్వార్టర్ ఫలితాలు అంచనాలను అందుకోకపోవడంలో వంట నూనెల ధరల పెరుగుదలే కారణమని సంస్థ సీఈవో తెలిపారు. డాబర్ ఇండియా, ఐటీసీ, హిందూస్థాన్ యూనీలీవర్, బ్రిటానియా, హల్దీరామ్స్ వంటి సంస్థలన్నీ తమ తక్కువ ఖరీదు గల ప్యాకెట్ల ధరల్లో మార్పులు చేయకుండా బరువు తగ్గించి నష్టాలను తగ్గించుకుంటున్నాయి. 

Updated Date - 2022-06-02T18:01:48+05:30 IST