బస్సులో పక్కన కూర్చున్న వాళ్ళు ఇచ్చే వాటిని తింటున్నారా..? ఈ 52 ఏళ్ల మహిళకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-06-01T19:43:20+05:30 IST

ఆ 52 ఏళ్ల మహిళ అహ్మద్‌నగర్ నుంచి పుణె వెళ్లేందుకు మహారాష్ట్ర ఆర్టీసీ బస్ ఎక్కింది.. ఆమె పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు..

బస్సులో పక్కన కూర్చున్న వాళ్ళు ఇచ్చే వాటిని తింటున్నారా..? ఈ 52 ఏళ్ల మహిళకు ఏం జరిగిందంటే..

ఆ 52 ఏళ్ల మహిళ అహ్మద్‌నగర్ నుంచి పుణె వెళ్లేందుకు మహారాష్ట్ర ఆర్టీసీ బస్ ఎక్కింది.. ఆమె పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు.. ఆమె మార్గమధ్యంలో ఒక చోట పకోడీ కొని తన పక్కన కూర్చన్న వ్యక్తికి కూడా కొంచెం ఇచ్చింది.. అతను పకోడీ తీసుకుని తన దగ్గర ఉన్న బిస్కెట్లను ఆమెకు ఇచ్చాడు.. ఆ బిస్కెట్లను తిన్న ఆమె మత్తులోకి జారిపోయి చివరి స్టాప్ వరకు వెళ్లిపోయింది.. స్పృహలోకి వచ్చాక చూసుకుంటే ఆమె మెడలో ఉండాల్సిన రూ.15 లక్షల విలువైన నెక్లెస్ కనిపించకుండా పోయింది.. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


ఇది కూడా చదవండి..

స్టార్ హోటల్‌.. 8వ అంతస్తులోని ఓ బాత్రూంను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. డస్ట్‌బిన్‌లో చూస్తే..


పుణెకు చెందిన 52 ఏళ్ల మహిళ గత వారం అహ్మద్ నగర్‌లో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ పని పూర్తి కావడంతో తిరిగి పుణె వెళ్లేందుకు ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర ఆర్టీసీ బస్ ఎక్కింది. ఆమె పక్క సీట్లో ఒక వ్యక్తి కూర్చున్నాడు. మార్గ మధ్యంలో ఒకచోట ఆమె పకోడీ కొనుక్కుంది. తను తింటూ పక్క సీట్లో కూర్చున్న వ్యక్తికి కూడా ఇచ్చింది. అతను ఈమె నుంచి పకోడీ తీసుకుని ఆమెకు తన దగ్గర ఉన్న బిస్కెట్లు ఇచ్చాడు. ఆ బిస్కెట్లను తిన్న వెంటనే బాధిత మహిళ స్పృహ కోల్పోయింది. బస్సు చివరి స్టాప్‌నకు చేరుకున్నాక బస్ కండక్టర్ ఆమెను గమనించాడు. అప్పటికే ఆమె కూతురు ఫోన్ చేస్తోంది. 


కండక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఆ మహిళ పరిస్థితి చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే బస్సు వద్దకు చేరుకుని ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. స్ప‌‌ృహలోకి వచ్చిన ఆ మహిళ తన మెడలో ఉన్న రూ.15 లక్షల విలువైన నెక్లెస్ పోయినట్టు తెలుసుకుని షాకైంది. ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.  

Updated Date - 2022-06-01T19:43:20+05:30 IST