ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పామును పరుగెత్తించిన ఉడుత.. చూస్తే షాకవడం మాత్రం ఖాయం..

ABN, First Publish Date - 2022-08-17T03:00:23+05:30

పాముకు (snake) శత్రువు అనగానే ముంగిసా (mongoose) గుర్తుకొస్తుంది. ముంగిసను చూస్తే.. పాము పదడుగుల దూరంలో ఉంటుంది. ఎన్నిసార్లు పోటీపడినా ముంగిసదే పైకేయి ఉంటుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాముకు (snake) శత్రువు అనగానే ముంగిస (mongoose) గుర్తుకొస్తుంది. ముంగిసను చూస్తే.. పాము పదడుగుల దూరంలో ఉంటుంది. ఎన్నిసార్లు పోటీపడినా ముంగిసదే పైకేయి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. పాముతో తలపడిన ఉడుత (squirrel).. చివరకు దాన్ని పరుగెత్తిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. పాము, ఉడుత ఎదురెదురుగా తారసపడుతాయి. భయపడుతుందనుకున్న ఉడుత.. అందుకు విరుద్ధంగా పాముతో పోరాటానికి సిద్ధపడుతుంది. నా దారికి తప్పుకో అంటూ కొద్ది సేపు.. ఒకదానికొకటి హెచ్చరించుకుంటాయి. ముందుగా, ఎందుకొచ్చిందిలే అనుకున్నట్లు ఉడుత వెనక్కు తగ్గుతుంది. అయితే పాము బుసకొట్టడంతో దానికి కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే పాముతో  పోటీకి సై అంటుంది. అదే కోపంతో చివరకు పాము తల పట్టుకుని కొరికేస్తుంది. దీంతో అప్పటిదాకా బుసలుకొడుతున్న పాము.. ఈ దెబ్బకు తోక ముడుస్తుంది. చివరకు అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Elephant video: హైజంప్ చేసేందుకు ప్రయత్నించిన ఏనుగు.. కుదరకపోవడంతో చివరకు ఇలా కానిచ్చేసింది..





Updated Date - 2022-08-17T03:00:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising