Elephant video: హైజంప్ చేసేందుకు ప్రయత్నించిన ఏనుగు.. కుదరకపోవడంతో చివరకు ఇలా కానిచ్చేసింది..

ABN , First Publish Date - 2022-08-16T23:23:36+05:30 IST

జంతువులకు (Animals) సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social media) తెగ చక్కర్లు కొడుతుంటారు. కాస్త విభిన్నంగా ఉన్న వీడియోలు నెటిజన్లను విపరీతంగా...

Elephant video: హైజంప్ చేసేందుకు ప్రయత్నించిన ఏనుగు.. కుదరకపోవడంతో చివరకు ఇలా కానిచ్చేసింది..

జంతువులకు (Animals) సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social media) తెగ చక్కర్లు కొడుతుంటారు. కాస్త విభిన్నంగా ఉన్న వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ఇటీవల ఇలాంటి వీడియోలు తరచూ దర్శనమిస్తున్నాయి. ఇక ఏనుగులకు సంబంధించిన వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విచిత్రంగా ప్రవర్తించే ఏనుగుల వీడియోలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఈ కోవకే చెందుతుంది. ఓ ఏనుగు ఇనుప కంచెను దాటేందుకు ప్రయత్నిస్తుంది. హైజంప్ చేయాలని చూసి.. వీలుకాకపోవడంతో చివరకు ఎలాగోలా అనుకున్నది సాధిస్తుంది.


మిగతా జంతువులతో పోల్చుకుంటే, ఏనుగులు భారీ స్థాయిలో ఉండడంతో.. అవి ఏం చేసినా విచిత్రంగా అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు అవి ప్రవర్తించే తీరు.. ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఏనుగు చేసిన విన్యాసం (Elephant stunt) అందరినీ ఆకట్టుకుంటోంది. అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుకు ఓ ఇనుప కంచె (Iron fence) అడ్డమొస్తుంది. ఎలాగైనా దాన్ని దాటుకుని వెళ్లాలని చూస్తుంది. ఈ క్రమంలో హైజంప్ చేయాలని ట్రై చేస్తుంది. అయితే అది సాధ్యపడకపోవడంతో చాలా తెలివిగా ప్రయత్నిస్తుంది. ముందు కాళ్లను కంచె పైనుంచి అవతలి వైపునకు పెట్టి.. తర్వాత మెళ్లిగా ముందుకు జారుతుంది. తర్వాత కొద్ది కొద్దిగా కిందకు జారుతూ అవతలి వైపునకు ఈజీగా దాటేసి.. హమ్మయ్య! అనుకుంటూ అడవిలోకి వెళ్లిపోతుంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి..

Viral Video: ఈ కుక్క చాలా స్మార్ట్.. అచ్చం మనుషుల్లాగే దాగుడుమూతలు ఆడుతోంది చూడండి..





Updated Date - 2022-08-16T23:23:36+05:30 IST