ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పాత తరం పనిముట్టే అయినా.. ఎంత పక్కాకా పని చేస్తోందో చూడండి...

ABN, First Publish Date - 2022-07-29T01:37:54+05:30

ప్రస్తుత హైటెక్ యుగంలో ప్రతీ రంగంలో సాంకేతికత అభివృద్ధి చెందింది. ప్రపంచమే అరచేతిలోకి వచ్చి వాలడంతో పాటూ మనుషుల అవసరం లేకుండా చాలా పనులను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత హైటెక్ యుగంలో ప్రతీ రంగంలో సాంకేతికత (Technology) అభివృద్ధి చెందింది. ప్రపంచమే అరచేతిలోకి వచ్చి వాలడంతో పాటూ మనుషుల అవసరం లేకుండా చాలా పనులను యంత్రాలు, రోబోలే చేసేస్తున్నాయి. ఇప్పుడంటే ఇలాంటి సౌలభ్యం ఉంది కానీ.. పెద్దల కాలంలో పరిస్థితి ఎలా వుండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే టెక్నాలజీ అందుబాటులోని అప్పటి కాలంలో పల్లెల్లో వివిధ పనులకు వినియోగించే వస్తువులను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాత తరం పనిముట్టును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రముఖ వ్యాపారవేత్త (businessman) ఆనంద్ మహీంద్ర (Anand Mahindra).. ఆ వీడియోను తన ట్విటర్ (Twitter) ఖాతా ద్వారా షేర్ చేశారు. 


వడ్లు, జొన్నలు తదితరాలను దంచేందుకు అప్పట్లో రోళ్లను వినియోగించేవారని అందరికీ తెలుసు. అయితే రోకలితో దంచేందుకు మనిషి అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా ఏర్పాటు చేసిన పరికరం అందరినీ ఆకట్టుకుంటోంది. రోకలి ఆకారంలో ఉన్న ఓ కర్రను చక్రాలకు అనుసంధానం చేశారు. అదేవిధంగా నీళ్లు మీద పడగానే చక్రం తిరిగేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా ఇంజిన్, మనుషులతో పని లేకుండా ఈ రోకలి పని చేస్తుందన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వినూత్న ఆవిష్కరణలను ఇష్టపడే ఆనంద్ మహీంద్రాకు.. ఈ పాతతరం పరికరం తెగ నచ్చేసిందట. ఈ పరికరం సమర్థవంతమైనదే కాకుండా అందమైనది.. అని వ్యాఖ్యానిస్తూ వీడియోను షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాన్ని వద్దనుకున్నాడు.. ఇప్పుడు అతడికి ప్రతీ రోజూ రూ.2.40 లక్షలు.. అమెరికా, జపాన్ నుంచి కూడా ఆర్డర్లు..! 





Updated Date - 2022-07-29T01:37:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising