ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

snake moves with legs: కాళ్లతో నడుస్తున్న పాము.. విచిత్రంగా ఉంది కదా.. చూస్తే వావ్! అనాల్సిందే..

ABN, First Publish Date - 2022-08-18T01:08:10+05:30

కొందరు అందరిలా కాకుండా విచిత్రంగా, విభిన్నంగా ఆలోచిస్తుంటారు. వాటి ఫలింతంగానే అప్పుడప్పుడూ వినూత్న ఆవిష్కరణలు (Innovative inventions) వెలుగులోకి వస్తుంటాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు అందరిలా కాకుండా విచిత్రంగా, విభిన్నంగా ఆలోచిస్తుంటారు. వాటి ఫలింతంగానే అప్పుడప్పుడూ వినూత్న ఆవిష్కరణలు (Innovative inventions) వెలుగులోకి వస్తుంటాయి. ఇలాంటి ఆవిష్కరణలను చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంటుంది. అలాంటి సమయాల్లో.. ‘‘ఇలాంటి ఐడియాలు.. ఎలా వస్తాయో..’’ అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వ్యక్తికి కూడా ఇలాంటి ఐడియానే వచ్చింది. పాములపై అమితమైన ప్రేమ పెంచుకున్న ఓ వ్యక్తి.. వాటికి మనుషుల మాదిరే కాళ్లు ఉంటే ఎలా ఉంటుంది.. అని ఆలోచించాడు. ఇంకేముందీ.. వెంటనే తన మెదడుకు పదును పెట్టాడు. చివరకు ఓ అద్భుత ఆవిష్కరణ మన ముందుకు తీసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


అలెన్ పాన్ అనే యూట్యూబర్‌కు (YouTuber) కొత్త కొత్త ప్రయోగాలు చేయడం అలవాటు. అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచిస్తూ అందరి నోళ్లలో నానుతున్నాడు. అయితే ఇటీవల అతడికి వినూత్నమైన ఐడియా వచ్చింది. స్వతహాగా పాములంటే ఎంతో ఇష్టపడే అలెన్.. వాటి కోసం ఏదైనా చేయాలని నిత్యం ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతడు, పాములు నడిస్తే ఎలా వుంటుంది.. అని ఆలోచించాడు. వెంటనే తన ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చాడు. పొడవాటి ప్లాస్టిక్ గొట్టానికి నాలుగు రొబోటిక్ కాళ్లను (Robotic legs) ఏర్పాటు చేశాడు. కంప్యూటర్ ద్వారా దానిని నియంత్రించేలా ఏర్పాట్లు చేశాడు.

Viral Video: పామును పరుగెత్తించిన ఉడుత.. చూస్తే షాకవడం మాత్రం ఖాయం..


ఓ చిన్న కొండచిలువను ఆ గొట్టంలోకి పంపించి తన పరికరం పనితీరును పరీక్షించాడు. అది విజయవంతం అవడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. "నాకు పాముల్ని చూసి జాలి వేసింది. అవి వాటి కాళ్లను పోగొట్టుకున్నాయి. ఎవరూ వాటిని వెతకలేదు. నేను వెతికాను. నేను స్నేక్ లవర్‌ని" అని అల్లెన్ తెలిపాడు. రొబోటిక్ కాళ్లతో నడుస్తున్న ఈ పాము వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనిపై పలువురు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Elephant video: హైజంప్ చేసేందుకు ప్రయత్నించిన ఏనుగు.. కుదరకపోవడంతో చివరకు ఇలా కానిచ్చేసింది..





Updated Date - 2022-08-18T01:08:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising