ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అన్నిసార్లూ ఇలాగే ఉండదు బ్రదర్.. కాస్త జాగ్రత్తగా ఉండడం నేర్చుకో..

ABN, First Publish Date - 2022-09-12T00:04:10+05:30

కొందరు తెలిసి తెలిసి ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు. ఇంకొందరు ప్రమాదమని తెలిసినా కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు, అందరితో హీరో అనిపించుకోవాలనే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు తెలిసి తెలిసి ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు. ఇంకొందరు ప్రమాదమని తెలిసినా కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు, అందరితో హీరో అనిపించుకోవాలనే ప్రయత్నంలో చివరకు ప్రమాదాలబారిన పడుతుంటారు. అయితే కొన్నిసార్లు అదృష్టవశాత్తు వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి బయటపడుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో (Viral videos) ఓ వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అంతలోనే ట్రైన్ దూసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) భర్తన రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా మంది రైలు పట్టాలు దాటే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదాలకు (Train accidents) గురవుతుంటారు. అయితే కొందరు మాత్రం అదృష్టవశాత్తు బయటపడుతుంటారు. భర్తన రైల్వే స్టేషన్‌లో కూడా ఇలాగే జరిగింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా రైలు పట్టాలు దాటుతున్న సమయంలో సడన్‌గా రైలు దూసుకొస్తుంది. అయితే ఉన్నట్టుండి అతడు తెలివిగా వ్యవహరించి.. ప్లాట్‌ఫామ్ గోడకు, పట్టాలకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో పడుకుంటాడు. అక్కడున్న వారంతా ఏమైందో అని కంగారుగా చూస్తుంటారు. అయితే ఆ వ్యక్తి మాత్రం ఎటూ కదలకుండా అలాగే పడుకుని ఉంటాడు. రైలు వెళ్లిపోయాక పైకి లేచి.. దేవుడా బతికిపోయా! అనుకుంటూ అందరికీ దండం పెడతాడు. రైలు వెళ్లిన సమయంలో ఏమాత్రం పక్కకు కదిలినా పెద్ద ప్రమాదం జరిగుండేది. అయితే ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: సింహం అని ఊరికే అన్నారా.. తలపడితే ఇలాగే ఉంటుంది మరి..





Updated Date - 2022-09-12T00:04:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising