Viral Video: సింహం అని ఊరికే అన్నారా.. తలపడితే ఇలాగే ఉంటుంది మరి..

ABN , First Publish Date - 2022-09-11T23:24:13+05:30 IST

పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగల్‌గా వస్తుంది.. అనే సినిమాలో డైలాగ్‌కు.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కరెక్ట్‌గా సెట్ అవుతుంది. బోనులో ఉన్నా, బయట ఉన్నా.. సింహం..

Viral Video: సింహం అని ఊరికే అన్నారా.. తలపడితే ఇలాగే ఉంటుంది మరి..

పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగల్‌గా వస్తుంది.. అనే సినిమాలో డైలాగ్‌కు.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కరెక్ట్‌గా సెట్ అవుతుంది. బోనులో ఉన్నా, బయట ఉన్నా.. సింహం సింహమే అని నిరూపించింది. సింహానికి ఎంత బలం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఎంత పెద్ద జంతువునైనా ఇట్టే మట్టికరిపిస్తుంది. అయితే సింహానికి ఎంత బలం వుందో అని కొందరు కండలు తిరిగిన యువకులు పరీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ (Viral video) అవుతోంది. రోప్ పుల్లింగ్ గేమ్‌ ద్వారా (Rope pulling game) బోనులో ఉన్న సింహం బలాన్ని పరీక్షించాలని చూస్తారు. ఇనుమ ఊచల మధ్యలో నుంచి ఓ తాడును లోపలికి వదులుతారు. అటు వైపు సింహం ఒక్కటి తాడును నోటితో గట్టిగా పట్టుకుంటుంది. ఇటువైపు ముగ్గురు బలమైన బాడీ బిల్డర్లు తాడును లాగడానికి ప్రయత్నిస్తారు. చాలా సేపు సింహాన్ని ఓడించాలని ప్రయత్నిస్తారు. అయితే ఎంత లాగినా చేతులు మంట పుట్టడం తప్ప ప్రయోజనం ఉండదు. సింహాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు కదిలించలేరు. చాలా సేపటి తర్వాత మా వల్ల కాదంటూ ముగ్గురూ చేతులు ఎత్తేస్తారు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సింహంతో మామూలుగా ఉండదు మరి.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Viral video : అయ్యో పాపం..! జొమాటో డెలివరీ బాయ్‌కి ఎంత కష్టం వచ్చింది.. కుక్క వల్ల ఇలా అవుతుందని ఎవరూ ఊహించలేదు..





Updated Date - 2022-09-11T23:24:13+05:30 IST