ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mr Happy Face.. పై ఫొటోలోని శునకాన్ని చూశారా? అది సాధించిన ఘనత ఏంటో తెలుసా?

ABN, First Publish Date - 2022-06-28T00:43:52+05:30

యునైటెడ్ స్టేట్స్‌లోని అరిజోనాకు చెందిన 17 ఏళ్ల చివావా మిక్స్ జాతికి చెందిన మిస్టర్ హ్యాపీ ఫేస్ అనే శునకం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యునైటెడ్ స్టేట్స్‌లోని అరిజోనాకు చెందిన 17 ఏళ్ల చివావా మిక్స్ జాతికి చెందిన మిస్టర్ హ్యాపీ ఫేస్ అనే శునకం World's Ugliest Dogగా ఎంపికైంది. కాలిఫోర్నియాలో సోనోమా-మారిన్ ఫెయిర్ సందర్భంగా జరిగిన పోటీలో పాల్గొన్న మిస్టర్ హ్యాపీ ఫేస్.. 8 పోటీదారులను ఓడించి విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమం దాదాపు 50 ఏళ్లుగా కొనసాగుతోంది. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఈ పోటీ ఈ ఏడాది జరిగింది. 


ఇది కూడా చదవండి..

Viral Video: కళ్ల ముందే కనిపించకుండా పోయిన ఇల్లు.. కళ్లు మూసి తెరిచేలోపే మాయమైపోయిందిలా..!



విజేతగా నిలిచిన Mr Happy Face ట్యూమర్, నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. నిటారుగా నిలబడటానికి, నడవడానికి కూడా కష్టపడుతుంది. తల ఎప్పుడూ వంగి ఉంటుంది. ఒకప్పుడు మిస్టర్ హ్యాపీ ఫేస్ దుర్భర పరిస్థితుల్లో జీవించింది. ఆరిజోనాలోని ఆశ్రయం నుంచి 2021 ఆగస్టులో ఈ కుక్కను బెనెల్లీ కుటుంబం దత్తత తీసుకుంది. దయనీయ స్థితిలో ఉన్న ఆ కుక్కను దత్తత తీసుకునేటపుడు.. అది ఒక వారం, మహా అయితే ఒక నెల మాత్రమే ప్రాణాలతో ఉంటుందని వెటర్నరీ డాక్టర్ చెప్పాడని బెనల్లీ అన్నారు. 


ఈ పోటీలో పాల్గొని విజేతగా నిలిచినందుకు మిస్టర్ హ్యాపీ ఫేస్‌కు, దాని యజమానికి రూ.1.17 లక్షల బహుమతి లభించనుంది. అలాగే ఆ కుక్కతో పాటు యజమాని కుటుంబానికి కూడా న్యూయార్క్ ట్రిప్ ఉచితంగా లభిస్తుంది. 

Updated Date - 2022-06-28T00:43:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising