భారీ వర్షాలు, వరదల కారణంగా చైనా అతలాకుతలమవుతోంది. వంద ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ చైనా ప్రాంతం ఈ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయింది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఊహించలేని రీతిలో అస్తి నష్టం వాటిల్లింది. చెరువులు, నదుల్లో నీరు ప్రమాదకర స్థాయిని దాటేసింది. వరదల ఉధృతికి భారీ భవంతులు కళ్ల ముందే కుప్పకూలుతున్నాయి. కార్లు, పెద్ద పెద్ద వాహనాలు సైతం కొట్టుకుపోతున్నాయి.
వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చైనాలోని వరదల పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ వీడియోలో ఓ భారీ భవంతి కూలిపోయి నీటిలో కొట్టుకుపోయింది. తమ ఇల్లు కొట్టుకుపోతోండడంతో వారంతా అరుపులు, కేకలు పెట్టారు.
ఇవి కూడా చదవండి