ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gulf: కొడుకు గురించి తల్లడిల్లిన మాతృమూర్తికి బాసటగా నిలిచిన తెలుగుతనం

ABN, First Publish Date - 2022-10-24T17:05:36+05:30

గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి అండగా నిలిచిన సాటా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: నాలుగువేల కిలోమీటర్ల అవతల సౌదీ అరేబియాలోని ఒక పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక ప్రవాసీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి స్వదేశంలోని అతని కుటుంబం అల్లాడిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన అనేక మంది సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలలో ఉన్నారు. రోడ్డు ప్రమాద బాధితుడి సమాచార సేకరణ కష్టమవడంతో తల్లి అల్లాడిపోతుండగా.. అమెకు సౌదీలో ‘సాటా’ అనే ఒక తెలుగు సంఘం ఉందని, అందులో ముజమ్మీల్ అనే ఒంగోలుకు చెందిన వ్యక్తి సహాయపడుతాడని ఎవరో చెబితే అతనికి ఫోన్ చేసింది. అమెకు ముజమ్మీల్ ఎవరో తెలియదు, ఒంగోలు అని అంతకన్నా తెలియదు. వారి స్వస్థలం నుండి ఒంగోలు నగరం 550 కిలోమీటర్లు కాగా రియాధ్ రాజధాని నగరం 4400 కిలో మీటర్లు.

అయినా ఏడ్చుకొంటూ ఆ తల్లి సాటా ప్రధాన కార్యదర్శి అయిన ముజమ్మీల్‌కు ఫోన్ చేసి తన కొడుకు ఆరోగ్య స్థితి గురించి తెలుసుకోండంటూ ప్రాధేయపడింది. నిమిషాలలో సాటా సభ్యులు అప్రమత్తమయ్యారు. ముజమ్మీల్ వెంటనే ప్రమాదం జరిగిన అల్ హసా పట్టణంలోని సాటా సభ్యులయిన డాక్టరు యస్. సురేశ్, జావీద్ (కడప) లకు సమాచారమందించారు. దీంతో వారు నిమిషాలలో ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఒక ప్రైవేటు ఆసుపత్రిలోని ఐ.సి.యులో పరామర్శించి, డాక్టర్ జావీద్ ద్వార్వా పూర్తి సమాచారాన్ని తెలుసుకొని కోరుట్లలోని కుటుంబానికి తెలియజేశారు.

తమ కొడుకు సమాచారం తెలుసుకొన్న కోరుట్లలోని కుటుంబం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొంది. మీ కొడుకు ఐ.సి.యులో ఉన్నా ప్రమాదం నుంచి బయట పడ్డాడని తెలుగు డాక్టర్లు చెప్పడంతో ఆ కుటుంబం హమ్మయ్యా అనుకొంది. ప్రమాదవార్త తెలిసిన 24 గంటల నుండి అన్నం, నీరు లేక ఆందోళనతో గడిపిన కుటుంబానికి సాటా తన సమాచారంతో బాసటగా నిలిచింది. ఈ రకమైన అనేక కుటుంబాలకు సాటా సభ్యులు ఆపద సమయంలో అండగా నిలుస్తున్నారు. సౌదీ అరేబియాలో అత్యవసర సందర్భాలలో సహాయం కోసం 966556473503 నెంబర్‌పై ముజమ్మీల్‌ను సంప్రదించవచ్చు.

Updated Date - 2022-10-24T19:47:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising