Kuwait: ఆ దేశం వారికి బిగ్ షాక్.. వర్క్ వీసాలపై నిషేధం కొనసాగింపు
ABN, First Publish Date - 2022-12-07T11:40:51+05:30
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా వలస కార్మికుల పట్ల కఠినంగా వ్యవరిస్తోంది. వీసాలు, వర్క్ పర్మిట్ల (Work visa) కోసం ప్రవాసులకు ముప్పుతిప్పలు పెడుతోంది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా వలస కార్మికుల పట్ల కఠినంగా వ్యవరిస్తోంది. వీసాలు, వర్క్ పర్మిట్ల (Work visa) కోసం ప్రవాసులకు ముప్పుతిప్పలు పెడుతోంది. ఇక కువైటైజేషన్ పాలసీ వచ్చిన తర్వాత నుంచి ఆ దేశంలో వలస కార్మికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక సెప్టెంబర్‌లో ఈజిప్ట్ వర్కర్లకు (Egyptian workers) కువైత్ వర్క్ వీసాలు ఇవ్వడం నిలిపివేసింది. ఈజిప్టు రాయబార కార్యాలయం విధించిన షరతుల కారణంగా ఆ దేశ కార్మికులకు వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేయాలని కువైత్ మొదటి ఉప ప్రధాని, అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ ఆదేశించారు. తాజాగా ఈ సస్పెన్షన్ అలాగే కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే.. ఈజిప్ట్ నుంచి కువైత్‌లోకి ప్రవేశించే వారి కుటుంబ వీసా లావాదేవీల కోసం కాన్సులర్ ఫీజుల షెడ్యూల్‌ను ఈజిప్ట్ రాజధాని కైరోలోని కువైత్ ఎంబసీ అప్డేట్ చేసింది. ఆదివారం నుంచి అమలులోకి వచ్చిన ఈ నిర్ణయం ప్రకారం.. పిల్లల కోసం 2,250 ఈజిప్షియన్ పౌండ్లు, తల్లికి 3,000 ఈజిప్షియన్ పౌండ్లు వసూలు చేయనుంది. మరోవైపు ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కూడా అక్కడి అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దోషిగా తేలిన వారిని తక్షణమే దేశం నుంచి బహిష్కరించడం ఇప్పుడు కువైత్‌లో పరిపాటిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Updated Date - 2022-12-07T11:40:52+05:30 IST