ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi Arabia: ఆన్‌లైన్‌లో అలా చేసినా నేరమే!

ABN, First Publish Date - 2022-11-28T10:58:55+05:30

ఉద్యోగం, ఉపాధి కోసం నిత్యం వందలాది మంది భారతీయులు సౌదీ అరేబియాకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్లిన తర్వాత చాలా మంది తెలిసీ తెలియక సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అందువల్ల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఉద్యోగం, ఉపాధి కోసం నిత్యం వందలాది మంది భారతీయులు సౌదీ అరేబియాకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్లిన తర్వాత చాలా మంది తెలిసీ తెలియక సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అందువల్ల సౌదీ వెళ్లాక ముందే అక్కడ చట్టాల గురించి అవగాహన పెంచుకోవాలి. ఈ క్రమంలో సౌదీ అరేబియాలో అమలులో ఉన్న ఓ చట్టం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సౌదీ అరేబియా.. చట్టాలను చాలా కఠినంగా అమలు చేస్తుంది.

సౌదీ అరేబియాలో భిక్షాటన అస్సలు చేయకూడదు. భిక్షాటనపై సౌదీ ప్రభుత్వం నిషేధం విధించింది. కేవలం రోడ్లపై తిరుగుతూ, ప్రార్థనా మందిరాల వద్ద కూర్చుని చేసే భిక్షాటనపైనే కాదూ.. ఆన్‌లైన్‌లో యాచించడమూ ఇక్కడ నేరమే. సోషల్ మీడియా వేదికగా.. ఇబ్బందులు చెబుతూ.. ఆర్థిక సహాయాన్ని కోరడాన్నీ సౌదీ ప్రభుత్వం భిక్షాటనగానే పరిగణిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా భిక్షాటన చేస్తున్నట్టు పోలీసుల దృష్టికి వెళితే.. సదరు వ్యక్తులకు దాదాపు 6నెలల జైలు శిక్ష తప్పదు. అంతేకాదు భారీ మొత్తంలో ఫైన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. 50వేల సౌదీ రియాల్స్ అంటే దాదాపు రూ.10.86లక్షల ఫైన్ విధించే అవకాశం ఉంటుంది. అయితే.. సహాయం కావాల్సిన వాళ్లు.. అక్కడ చట్టబద్ధమైన చారిటీలను సంప్రదించాల్సి ఉంటుంది.

Updated Date - 2022-11-29T07:14:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising