ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశాల్లో స్థిరపడ్డా చదువుకున్న పాఠశాలను మర్చిపోలేదు

ABN, First Publish Date - 2022-12-12T08:52:40+05:30

రాష్ట్రంలో విద్యతో పాటు అన్ని రంగాలలో వెనుకబడ్డ జిల్లాగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు పేరున్న విషయం తెలిసిందే. కాగా.. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకోని విదేశాలలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వెనుకబడ్డ ఆసిఫాబాద్ జిల్లాలో పాఠశాల అభివృద్ధికి చేయూత

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: రాష్ట్రంలో విద్యతో పాటు అన్ని రంగాలలో వెనుకబడ్డ జిల్లాగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు పేరున్న విషయం తెలిసిందే. కాగా.. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకోని విదేశాలలో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు వీలు చేసుకుని మరీ మాతృభూమికి వెళ్ళడమే కాకుండ దశాబ్దాల క్రితం విద్యాభ్యాసం చేసిన పాఠశాలను సందర్శించారు. పాఠశాల అభివృద్ధికు చేయూతనిచ్చారు.

​1978-79లో కాగజ్ నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థుల్లో దాసరి భిక్షపతి ఒకరు. ఈయన ప్రస్తుతం సౌదీ అరేబియాలోని ఒక ప్రముఖ పెట్రోలియం సంస్ధలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. అదే పాఠశాలలో చదువుకున్న యన్. తిరుపతి రెడ్డి దుబాయిలో ఎలక్ట్రికల్ కంట్రాక్టింగ్ పని నెలకొల్పారు. మరో పూర్వపు విద్యార్థి చలసాని రాణి అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. వీరందరూ విదేశాల్లో స్థిరపడినప్పటికీ తాము చదువుకొన్న ప్రభుత్వ పాఠశాలను మాత్రం మరువలేదు.

ఈ క్రమంలోనే ఈ ముగ్గురూ తమతోపాటే చదువుకున్న స్నేహితులతో సంప్రదింపులు జరిపి శనివారం నాడు కాగజ్ నగర్‌కు వెళ్లారు. అంతేకాకుండా తాము విద్యాభ్యాసం చేసిన పాఠశాలను సందర్శించి.. అక్కడ కావల్సిన అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చారు. వాటర్ ప్లాంటు, ట్యాంకులు, మూత్రశాలలు మరియు తరగతి గదులకు మరమ్మత్తులు చేయించారు. క్రీడా మైదానాన్ని కూడా తిరిగి ఉపయోగంలోకి తీసుకొచ్చారు. విద్యార్థుల కోసం డెస్కులను కూడ సమకూర్చినట్లుగా భిక్షపతి తెలిపారు. ఇదిలా ఉంటే.. ​ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 1288 ప్రభుత్వ పాఠశాలల్లో 1052 పాఠశాలల్లో కనీసం తాగు నీటి వసతి కూడా లేదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-12-12T08:52:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising