ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bahrain: ప్రవాసులను భయపెడుతున్న బహ్రెయిన్.. సర్వేలో బయటపడిన షాకింగ్ విషయం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-12-06T11:14:46+05:30

గల్ఫ్ దేశం బహ్రెయిన్ (Bahrain) వలసదారులను భయపెడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనామా: గల్ఫ్ దేశం బహ్రెయిన్ (Bahrain) వలసదారులను భయపెడుతోంది. పెరిగిన జీవన వ్యయంతో అల్పాదాయ ప్రవాస కార్మికులు ఇక్కడ తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రతియేటా కాస్ట్ ఆఫ్ లివింగ్ (Cost of living) పెరుగుతున్న కార్మికులకు జీతాలు మాత్రం పెరగడం లేదు. ఏదో పొట్టకూటి కోసం ఎన్నో అప్పులు చేసి అక్కడికి వెళ్తున్న వలసదారులకు (Expats) చాలిచాలని జీతాలతో ఇబ్బందులు తప్పడం లేదు. తిరిగి వచ్చేద్దామంటే ఇక్కడ చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించడం లేదు. దాంతో ప్రస్తుతం బహ్రెయిన్‌లో ఉన్న వలస కార్మికుల పరిస్థితి 'ముందు నుయ్యి వెనుక గొయ్యి'గా తయారైంది. ఇక బహ్రెయిన్‌లో గడిచిన కొన్నేళ్లుగా నిత్యవసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఆహార పదర్థాలు, ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్లులు భారీగా పెరిగాయట. కానీ, వేతనాలు మాత్రం పెరగడం లేదని ప్రవాసులు వాపోతున్నారు. ఇలా నిత్యవసరాల ధరలు అమాంతం పెరుగుతుండడంతో అక్కడి కొంతమంది పార్లమెంట్ సభ్యులు తమ పరిధిలోని దేశ పౌరులకు రేషన్ కార్డులు సైతం జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వలసదారులు ప్రస్తావించారు.

తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. చాలా మంది వలస కార్మికులకు గడిచిన 17 ఏళ్ల నుంచి ఎలాంటి ఇంక్రిమెంట్స్ లేవట. వారు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఏ శాలరీ ఉందో ఇప్పటికీ అదే జీతానికి పని చేస్తున్నామని చాలామంది కార్మికులు సర్వేలో చెప్పారు. ఒక పక్క నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే మరోపక్క జీతాలలో ఎలాంటి పెరుగుదల కనిపించకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే.. కేవలం ప్రవాసులే కాదు అల్పాదాయ బహ్రెయినీలలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారట. పెరిగిన నిత్యవసరాల ధరల కారణంగా రోజువారీ అవసరాలకు వారికి కూడా తిప్పలు తప్పడం లేదని తాజాగా నిర్వహించిన సర్వే తేల్చింది.

Updated Date - 2022-12-06T11:22:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising