ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America Visa: భారత్‌లో ఇలా.. చైనాలో అలా.. ఆగ్రహంలో భారతీయులు!

ABN, First Publish Date - 2022-11-02T18:08:40+05:30

అమెరికా వీసా అపాయింట్‌మెంట్ టైం భారత్‌లో ఒకలాగా.. చైనాలో మరోలాగా ఉంది. ఇండియాలో వీసా రకాన్ని బట్టి.. అపాయింట్‌మెంట్ సమయం అత్యధికంగా 900 రోజుల వరకు ఉంది. అదే చైనాలో మాత్రం ఈ గడువు కేవలం 3 రోజులే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికా వీసా అపాయింట్‌మెంట్ టైం భారత్‌లో ఒకలాగా.. చైనాలో మరోలాగా ఉంది. ఇండియాలో వీసా రకాన్ని బట్టి.. అపాయింట్‌మెంట్ సమయం అత్యధికంగా 900 రోజుల వరకు ఉంది. అదే చైనాలో మాత్రం ఈ గడువు కేవలం 3 రోజులే ఉంది. అయితే ఈ వ్యత్యాసం పట్ల అమెరికాలోని భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో వీసా అపాయింట్‌మెంట్ కోసం నిరీక్షించే సమయాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే Change.Org ద్వారా ఆన్‌లైన్‌లో పిటిషన్‌ను దాఖలు చేసి, వీసా కోసం నిరీక్షించే సమయం తగ్గేలా చర్యలు తీసుకోవాలని స్టేట్ డిపార్ట్‌మెంట్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంథోనీ బ్లింకన్‌ను కోరారు.

అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించాలన్నా, ఉన్నత చదువులు, ఉద్యోగం చేయాలన్నా వీసా తప్పనిసరి. వీసా ఉంటేనే అమెరికాలో అడుగుపెట్టగలం. కాగా.. వీసా పొందేందుకు విదేశీ పౌరులు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దరఖాస్తు దారులకు ఆయా దేశాల్లోని అమెరికా ఎంబసీ, కాన్సులేట్లలో వీసా ఇంటర్యూలు ఉంటాయి. వీసా కోసం అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్యూ కోసం వేచి ఉండాల్సిన సమయాన్ని అపాయింట్‌మెంట్ టైంగా చెప్పుకోవచ్చు.

కాగా.. travel.state.gov రిపోర్టు ప్రకారం విజిటర్ వీసా(visitor visa) కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులు వీసా అపాయింట్‌మెంట్ పొందేందుకు సగటున 900పైగా రోజుల సమయం పడుతుంది. అదే స్టూడెంట్ వీసా(Student Visa) అపాయింట్‌మెంట్‌కు దాదాపు 400 రోజుల సమయం పడుతోంది. ఈ క్రమంలోనే అమెరికాలోని ప్రవాస భారతీయులు ఆన్‌లైన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. పర్యాటక వీసాల కోసం వందలాది రోజులు వేచిచూడాల్సిన పరిస్థితి ఉన్నందున ముఖ్యమైన సమయాల్లో, పండగ వేళ తమ కుటుంబ సభ్యులు అమెరికా రాలేకపోతున్నారని వాపోయారు. స్టూడెంట్ వీసా అపాయింట్‌మెంట్‌కు కూడా వందల రోజుల సమయం(Visa wait time) పడుతున్నందన విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వీసా అపాయింట్‌మెంట్ గడువును తగ్గించేందకు చర్యలు తీసుకోవాలని పిటిషన్ ద్వారా ఆంథోనీ బ్లింకన్‌ను అభ్యర్థించారు.

Updated Date - 2022-11-02T20:06:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising