ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America: చరిత్ర సృష్టించిన యువకుడు.. 18ఏళ్లకే మేయర్‌గా ఎన్నిక!

ABN, First Publish Date - 2022-12-08T19:08:51+05:30

అమెరికాలో 18ఏళ్ల యువకుడు చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ప్రారంభంలో హైస్కూల్‌ నుంచి పట్టభద్రుడైన అతడు.. నగర మేయర్‌గా ఎన్నికై అందర్నీ ఆశ్చర్యపరచాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో 18ఏళ్ల యువకుడు చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ప్రారంభంలో హైస్కూల్‌ నుంచి పట్టభద్రుడైన అతడు.. నగర మేయర్‌గా ఎన్నికై అందర్నీ ఆశ్చర్యపరచాడు. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని ఆర్కన్సాస్‌కు చెందిన జైలెన్ స్మిత్ అనే యువకుడు.. ఎర్లే(Earle) అనే చిన్న నగరానికి జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేశాడు. ఈ క్రమంలోనే విజయభేరీ మోగించాడు. జైలెన్ స్మిత్ తన ప్రత్యర్థి అయిన నేమీ మ్యాథ్యూస్‌ను 185 ఓట్ల తేడాతో ఓడించి.. ఎర్లే నగర మేయర్‌గా ఎన్నికయ్యాడు. ఈ క్రమంలోనే అమెరికాలో మేయర్‌గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉంటే.. 2020 జనాభా లెక్కల ప్రకారం ఎర్లే నగరంలో 1,831 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇకపోతే జైలెన్ స్మిత్.. ఏర్లే హైస్కూల్‌లో ఈ ఏడాది మేలోనే గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఎన్నికల్లో గెలవడంపట్ల సంతోషం వ్యక్తం చేసిన అతడు.. ఎర్లేలో నూతన అధ్యాయం ప్రారంభించడానికి ఇది సరైన సమయం అన్నాడు.

Updated Date - 2022-12-08T19:18:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising