ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: హిందూ సంప్రదాయం ప్రకారం వివాహమాడిన అమెరికా యువతి!

ABN, First Publish Date - 2022-12-14T20:45:52+05:30

ఆమె అమెరికా యువతి. ఉన్నత ఉద్యోగం చేస్తోంది. కానీ.. ఆమెకు సంబంధించిన వివాహ ఫొటోలు, వీడియోలు నెటింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఆమె అమెరికా యువతి. ఉన్నత ఉద్యోగం చేస్తోంది. కానీ.. ఆమెకు సంబంధించిన వివాహ ఫొటోలు, వీడియోలు నెటింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తున్న నెటిజన్లు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికా(America)కు చెందిన రోజర్స్(Rogers) లాస్ ఏంజిల్స్‌లో ఇమ్మిగ్రేషన్ అటార్నీగా పని చేస్తోంది. అమె అగ్రరాజ్యానికి చెందిన యువతి అయినప్పటికీ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి(Marriage) చేసుకుంది. విధుర్ గోయల్ అనే యువకుడిని నవంబర్ 18న జైపూర్‌లోని జై మహల్ ప్యాలేస్ ఆమె వివాహమాడింది. పెళ్లి సందర్భంగా రోజర్స్ ఎరుపు రంగు లెహంగా ధరించి.. హిందూ సంప్రదాయం ప్రకారం ముస్తాబైంది. ఆమెతోపాటు రోజర్స్ తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ఇలా అందరూ హిందూ సంప్రదాయం ప్రకారమే రెడీ అయి పెళ్లికి హాజరయ్యారు. ప్రస్తుతం ఆ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను మేకప్ ఆర్టిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్తా నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు ఆ వీడియోలను, ఫొటోలను 5 మిలియన్ల మందికిపైగా వీక్షించారు. ఈ క్రమంలో నెటిజన్లు స్పందిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో రోజర్స్ తాజాగా స్పందించింది. నెటిజన్ల నుంచి వస్తున్న స్పందన చూసి ఆనందం వ్యక్తం చేసింది.

Updated Date - 2022-12-14T20:45:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising