ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Snack Time: డిన్నర్‌కు చాలా సమయం ఉంది.. ఆకలేస్తుంటే ఏం తినాలి?

ABN, First Publish Date - 2022-11-11T21:26:06+05:30

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినేశాం. లంచ్ కూడా అయిపోయింది. సాయంత్రం అయ్యాక అసలు సందేహం మొదలవుతుంది. ఆకలి వేస్తుంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినేశాం. లంచ్ కూడా అయిపోయింది. సాయంత్రం అయ్యాక అసలు సందేహం మొదలవుతుంది. ఆకలి వేస్తుంటుంది. డిన్నర్‌కు చాలా సమయం ఉంటుంది. మరి అప్పుడేం తినాలి? సాయంత్రం ఐదు గంటలు అయిందంటే చాలామంది మదిలో మెదిలే ప్రశ్న ఇదే. స్కూలు నుంచి, కాలేజీ నుంచి పిల్లలు ఇంటికొచ్చే సమయం కూడా అదే. ఉద్యోగులకు కార్యాలయాలు వదిలే సమయం. ఎవరు ఎక్కడున్నా ఆకలి మాత్రం కామన్‌గా అందరి దగ్గర ఉంటుంది. దేశంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఏ సమయంలో అయినా ఆహారం లభ్యమవుతూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం తినాలనే విషయం గురించి ఫుడీ, సాహసోపేత ట్రావెలర్ అరుణ ప్రియ దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ లభ్యమయ్యే విభిన్న వంటకాల గురించి చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఖాక్రా: ఈ వంటకం గుజరాత్‌లో పుట్టి ఉండొచ్చు కానీ అహ్మదాబాద్ మొదలు లాస్ ఏంజెలెస్, బెర్లిన్, మాల్దీవులలో అధికంగా కనిపించే స్నాక్స్ ఇది. ఈ స్నాక్ తయారీలో గోధుమపిండి, బీన్‌, నూనె వాడతారు. కోరుకున్న రుచులు ఇందులో లభ్యమవుతాయి.

సేవ్: ఇది దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తుంది. వైవిధ్యమైన స్నాక్ ఇది. ఇంట్లోనూ అతి సులభంగా తయారుచేసుకోగలిగే వంటకం. దీంట్లో శనగపిండి, జీలకర్ర, కారం, వాము వంటివి జోడించి రుచికరంగా తయారుచేస్తారు.

పాపడ్స్: పప్పు, అన్నం, పచ్చడితోపాటు పాపడ్. ఇవి ముందున్నప్పుడు ఇంతకుమించిన ఆనందం ఇంకేమీ ఉండదు. పాపడ్ (అప్పడం)ను ఏ పిండితో అయినా చేసుకోవచ్చు. వేసవిలో నిల్వ చేసుకుంటే మిగిలిన రోజుల్లో వాడుకోవచ్చు. ఇటీవలి కాలంలో వీటిలోనూ ఎన్నో రుచులు అందుబాటులోకి వచ్చాయి. నూనెలో వేయించుకుంటే చాలు.. రుచికరమైన స్నాక్ సిద్ధమైనట్టే.

చిప్స్, పకోరా: వీటిని మనకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. అంటే.. అరటి, పనస, బంగాళదుంప, కాలిఫ్లవర్, పన్నీర్.. ఎలాగైనా చేసుకోవచ్చు. శనగపిండి, జీర, పసుపు, కారం, గరం మసాలా, వాము లాంటివి జోడించే రుచికరంగా ఉంటాయి.

అయితే, స్నాక్ ఏదైనా దాని తయారీకి మనం ఎలాంటి నూనె ఉపయోగించామన్న దానిపైనే దాని రుచి, నిల్వ కాలం ఆధారపడి ఉంటుంది. ఇదే విషయమై గోల్డ్‌డ్రాప్‌ (Gold Drop) సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా మాట్లాడుతూ.. దశాబ్దాలుగా దేశంలోని వంటిల్లును గోల్డ్‌డ్రాప్ ఘుమఘుమలాడిస్తోందని అన్నారు. వాసన లేని, స్వచ్ఛమైన తమ నూనెలు ఈ భరోసాను అందిస్తాయన్నారు. వంటకం ఏదైనా దాని తయారీకి వాడే నూనెను బట్టే అది మరింత రుచికరంగా మారుతుందని చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-11-11T21:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising