Chennai: నటి గాయత్రీ రఘురామ్‌పై సస్పెన్షన్ వేటు..
ABN, First Publish Date - 2022-11-23T15:00:23+05:30
చెన్నై (Chennai): పార్టీకి మచ్చతెచ్చే విధంగా వ్యవహరిస్తున్నందుకు నటి గాయత్రీ రఘురామ్ (Gayathri Raghuram)ను ఆరు నెలలపాటు బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు..
పార్టీకి మచ్చతెచ్చే విధంగా వ్యవహరిస్తున్నందుకు నటి గాయత్రీ రఘురామ్ (Gayathri Raghuram)ను ఆరు నెలలపాటు బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (Annamalai) ప్రకటించారు. పార్టీ నిబంధన ఉల్లంఘించి చెడ్డపేరు తెచ్చే విధంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గాయత్రీ రఘురామ్‌ను పార్టీ బాధ్యతలు అన్నింటి నుంచి తప్పిస్తున్నట్లు అన్నామలై ఓ ప్రకటనలో తెలిపారు.
పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ గాయత్రీ రఘురామ్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపరాదని అన్నామలై సూచించారు. అయితే తనను పార్టీ బాధ్యతల నుంచి తప్పించినప్పటికీ తాను నిఖార్సైన బీజేపీ కార్యకర్త మాదిరిగా క్రమశిక్షణతో నడుచుకుంటానని గాయత్రీ రఘురాం స్పష్టం చేశారు.
Updated Date - 2022-11-23T15:00:27+05:30 IST