ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kejriwal in Gujarat : గుజరాత్‌లో కేజ్రీవాల్‌కు షాక్‌!

ABN, First Publish Date - 2022-12-12T05:28:02+05:30

ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌కు గుజరాత్‌లోని ఆయన పార్టీ నేతలు ఊహించని షాకిచ్చారు. మొన్నటి గుజరాత్‌ ఎన్నికల్లో ఆప్‌ ఐదు చోట్ల మాత్రమే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఐదుగురు బీజేపీతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. విశ్వదార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలూ బీజేపీలోకి జంప్‌?

బయట నుంచి మద్దతిస్తా: ఆప్‌ ఎమ్మెల్యే భయాని

అహ్మదాబాద్‌, డిసెంబరు 11: ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌కు గుజరాత్‌లోని ఆయన పార్టీ నేతలు ఊహించని షాకిచ్చారు. మొన్నటి గుజరాత్‌ ఎన్నికల్లో ఆప్‌ ఐదు చోట్ల మాత్రమే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఐదుగురు బీజేపీతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. విశ్వదార్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన భూపత్‌ భయానీ అయితే, ఆమ్‌ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి నేరుగా బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై స్పందించిన భయానీ తాను బీజేపీలో చేరడం లేదని ప్రకటించారు. కానీ అవసరమైతే బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తానని తెలిపారు. నిజానికి ఆప్‌ నుంచి గెలిచిన ఐదుగురిలో ముగ్గురు బీజేపీ మాజీ నేతలే. బీజేపీ టికెట్‌ నిరాకరించడంతో వీరు ముగ్గురూ కేజ్రీవాల్‌ పార్టీలో చేరారు. ఈ ఐదుగురి విజయం, 13ు ఓటింగ్‌తో తమ పార్టీకి జాతీయ హోదా దక్కినట్లేనని సంబర పడుతున్న సమయంలో ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు ఆప్‌లో కలవరం రేపుతున్నాయి.

బీజేపీ ఢిల్లీ చీఫ్‌ రాజీనామా

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తరువాత ఆ పార్టీ చీఫ్‌ ఆదేశ్‌ గుప్తా ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడిని నియమించే వరకూ వీరేంద్ర సచ్‌దేవ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారని పార్టీ పేర్కొంది. కార్పొరేషన్‌లోని మొత్తం 250 వార్డులకు గాను ఆప్‌ 134 వార్డులను గెలుచుకొంది. అయితే మేయర్‌ స్థానానికి బీజేపీ పోటీ పడుతుందంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో ‘ప్రజల తీర్పు ఆప్‌ వైపు ఉంది. వాళ్లు వారి మేయర్‌ను ఎన్నుకుంటా రు’ అని ఆదేశ్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-12T05:28:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising