ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dr gudaru Jagadish: డాక్టర్ గుడారు జగదీశ్‌ను సన్మానించిన వైగో

ABN, First Publish Date - 2022-12-31T19:07:57+05:30

ఆర్థోపెడిక్ ప్రముఖ వైద్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని బర్డ్ (BIRRD) ఆసుపత్రి మాజీ డైరెక్టర్ డాక్టర్ గుడారు జగదీశ్‌(Dr gudaru Jagadish)ను ఎండీఎంకే (MDMK) పార్టీ ఎంపీ వైగో (vayyapuram

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ఆర్థోపెడిక్ ప్రముఖ వైద్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని బర్డ్ (BIRRD) ఆసుపత్రి మాజీ డైరెక్టర్ డాక్టర్ గుడారు జగదీశ్‌(Dr gudaru Jagadish)ను ఎండీఎంకే (MDMK) పార్టీ ఎంపీ వైగో (vayyapuram gopalaswamy) సన్మానించారు. సామాజిక సంక్షేమం, న్యాయశాఖ ఆధ్వర్యంలో 10 వేలకుపైగా శస్త్రచికిత్సలు, చక్రాల కుర్చీలు పంపిణీ చేసినందుకు గాను వైగో ఆయనను సత్కరించారు.

డైరెక్టర్‌గా ఉన్న సమయంలో బర్డ్ ఆసుపత్రిని దక్షిణాసియాలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా డాక్టర్ జగదీశ్ తీర్చిదిద్దారు. ఆయన ఆధ్వర్యంలో బర్డ్ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 1.28 లక్షల మందికి సర్జరీలు చేశారు. రోజూ 50కిపైగా ఆపరేషన్లు చేస్తారు. దేశవ్యాప్తంగా 224 వైద్య శిబిరాలు నిర్వహించి దాదాపు1.10 లక్షల మంది చిన్నారులకు వైద్య సేవలు అందించారు. 20 వేల మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. 2008లో వేగేశ్న ఫౌండేషన్, ద్వారకా తిరుమల ఆలయం సహకారంతో విర్డ్ (VIRRD)ను ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఎంతోమందికి శస్త్రచికిత్సలు చేశారు.

Updated Date - 2022-12-31T19:07:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising