ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America Vs China : మా మధ్య వేలు పెట్టారో ఖబడ్దార్... అమెరికాకు చైనా హెచ్చరిక...

ABN, First Publish Date - 2022-11-30T16:59:47+05:30

భారత దేశంతో తన సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాను చైనా హెచ్చరించింది.

Xi Jinping, Narendra Modi, Joe Biden
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : భారత దేశంతో తన సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాను చైనా హెచ్చరించింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అమెరికాతో భారత దేశం మరింత సన్నిహితమయ్యే పరిస్థితులు ఏర్పడకుండా నిరోధించాలని చైనా కోరుకుంటోంది. ఈ వివరాలను అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తాజా నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను మంగళవారం అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించింది.

తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలను తక్కువ చేసి చూపించడానికి చైనా అధికారులు ప్రయత్నించారని ఈ నివేదిక పేర్కొంది. సరిహద్దు స్థిరత్వాన్ని కాపాడుకుంటూ, భారత దేశంతో ఇతర ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలని చైనా కోరుకున్నట్లు తెలిపింది.

చైనీస్ మిలిటరీపై ఇచ్చిన ఈ నివేదికలో ‘చైనా-భారత్ సరిహద్దు’ అనే విభాగంలో, సరిహద్దుల్లోని ఉద్రిక్తతలు అమెరికాతో భారత దేశం మరింత సన్నిహిత భాగస్వామ్యానికి కారణమవడాన్ని నిరోధించాలని చైనా కోరుకుందని పెంటగాన్ తెలిపింది. భారత దేశంతో చైనా సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధికారులను చైనా అధికారులు హెచ్చరించారని తెలిపింది. 2021లో చైనా సైన్యం తన దళాలను భారీగా మోహరించి, వాస్తవాధీన రేఖ వెంబడి రోడ్లు, తదితర మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని కొనసాగించిందని తెలిపింది. సరిహద్దులో భావిత ప్రయోజనాలను కోల్పోవడానికి ఇరు పక్షాలు నిరాకరించడంతో చర్చల వల్ల ఫలితం నామమాత్రంగా ఉందని పేర్కొంది.

తూర్పు లడఖ్‌లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు 2020 మే నెలలో ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ కూడా జరిగింది. దీంతో ఇరు దేశాలు తమ వైపు మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకున్నాయి. ‘మీ దళాలను ఉపసంహరించండి. ప్రతిష్టంభనకు పూర్వపు స్థితిని తీసుకురండి’ అని భారత్, చైనా పరస్పరం డిమాండ్ చేసుకున్నాయని ఈ నివేదిక పేర్కొంది. అయితే ఈ షరతులను ఇరు దేశాలు అంగీకరించలేదని పేర్కొంది. 2025 జూన్ 15న గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు చైనా అధికారులు చెప్తున్నారని తెలిపింది.

Updated Date - 2022-11-30T16:59:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising