ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP: మోదీపై పాకిస్థాన్ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ

ABN, First Publish Date - 2022-12-16T23:25:48+05:30

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) గుజరాత్ కసాయి అంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావుల్ భుట్టో (Bilawal Bhutto) చేసిన వ్యాఖ్యలకు బీజేపీ (BJP) నేతలు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) గుజరాత్ కసాయి అంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావుల్ భుట్టో (Bilawal Bhutto) చేసిన వ్యాఖ్యలకు బీజేపీ (BJP) నేతలు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. 1971లో భారత సైన్యం చేతిలో పాకిస్థాన్ ఓడినందుకు ఇంకా భుట్టో బాధలోనే ఉన్నట్టుందని కేంద్ర మంత్రులు చురకలంటించారు. పాకిస్థాన్ మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీలో పాకిస్థాన్ హైకమిషన్ ఆఫీస్ వద్ద బీజేపీ నేతలు నిరసనకు దిగారు. భుట్టో వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాక్ మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. భుట్టో వ్యాఖ్యలు సిగ్గుచేటంటూ పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేశారు. శనివారం రోజు రాజధాని నగరాల్లో పాక్ మంత్రి భుట్టో దిష్టిబొమ్మలను దగ్ధం చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడని.. కానీ గుజరాత్ కసాయి బతికే ఉన్నాడన్న పాక్ మంత్రి భుట్టో వ్యాఖ్యలను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.

Updated Date - 2022-12-16T23:26:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising